2023:టాలీవుడ్ లో అత్యధిక ఓపెనింగ్ సాధించిన చిత్రాలు ఇవే..!!

Divya
తెలుగు సినీ ఇండస్ట్రీలో ఈ ఏడాది మొదటి నుంచి మంచి బ్లాక్ బస్టర్ తెలుగు ప్రేక్షకులను బాగానే అలరించాయి.. ఇక ఏడాది అప్పుడే ఆరు నెలలు పూర్తిగా అయిపోయింది.. ఇప్పటి వరకు బాక్సాఫీస్ వద్ద భారీ బ్లాక్ బాస్టర్ చిత్రాలు స్టార్ హీరోలవి పెద్దగా ఆకట్టుకోలేక పోతున్నాయి. కేవలం చిన్న సినిమాలు మాత్రమే సక్సెస్ అయ్యి భారీగా కలెక్షన్లు రాబడుతున్నాయి. ఇక ఈరోజు వరకు టాలీవుడ్ లో ఈ ఏడాది విడుదలైన చిత్రాలలో అత్యధికంగా ఓపెనింగ్స్ డే సాధించిన చిత్రాలను ఇప్పుడు మనం ఒకసారి తెలుసుకుందాం.

ప్రభాస్ నటించిన పాన్ ఇండియా చిత్రాలలో ఆది పురుష్ చిత్రం కూడా ఒకటి.. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.135 కోట్ల రూపాయల గ్రాస్ వసూలు చేసినట్లు తెలుస్తోంది.. ఇక తర్వాత బాలయ్య నటించిన వీర సింహారెడ్డి సినిమా రూ .50 కోట్ల గ్రాస్ వసూల్.. చిరంజీవి నటించిన వాల్తేర్ వీరయ్య.. రూ.49.5 .. పవన్ కళ్యాణ్ నటించిన బ్రో మూవీ రూ.49 కోట్ల గ్రాస్ వసూల్.. నాని నటించిన దసరా సినిమా రూ .38 కోట్ల రూపాయలు గ్రాస్ వసూల్ సాధించినట్లు తెలుస్తోంది.

అయితే ఇందులో కొంతమంది స్టార్ హీరోలు సైతం ఇంకా తమ సినిమాలను విడుదల చేయడం లేదు.. ఈ ఏడాది చివరి కల్లా కొంతమంది స్టార్ హీరోల చిత్రాలు విడుదల అవుతూ ఉన్నాయి.. ముఖ్యంగా కంటెంట్ పరంగా స్టోరీ బాగుంటే చాలు ఆ సినిమాని ప్రేక్షకులు సైతం సక్సెస్ఫుల్గా హీట్ టాక్ తో దూసుకుపోయేలా చేస్తున్నారు. ఇప్పటివరకు ఎన్నో చిత్రాలు విడుదలైనప్పటికీ కేవలం ఈ ఐదు చిత్రాలే అత్యధికంగా గ్రాస్ వసూలు సాధించిన చిత్రాలుగా సినీ విశ్లేషకులు తెలియజేయడం జరిగింది. మరి మిగిలిన ఆరు నెలల వ్యవధిలో మరిన్ని చిత్రాలు ఈ రికార్డులను మించుతాయేమో చూడాలి మరి. తమ హీరోల చిత్రాలు విడుదల కావాలని ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు అభిమానులు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: