గేమ్ చేంజర్ సినిమా వాయిదా పడ్డట్టేనా..?
దాదాపుగా రెండు సంవత్సరాలుగా ఈ సినిమా షూటింగ్ ప్లాన్ చేసినట్లుగా సమాచారం. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ సినిమాని విడుదల చేయాలని చిత్ర బృందం పలు ప్రయత్నాలు చేస్తూనే ఉంది.. కానీ డైరెక్టర్ శంకర్ కమల్ హాసన్ తో కలిసి ఇండియన్-2 చిత్రాన్ని తెరకెక్కిస్తూ ఉన్నారు.ఈ సినిమా షూటింగ్ మొదలు పెట్టినప్పటి నుంచి పలు రకాల బ్రేక్స్ ఎదురవుతూనే ఉన్నాయి.ఇలా రెండు సినిమాలను షూటింగ్ చేస్తూ ఉండడంతో ఆ ఎఫెక్ట్ గేమ్ చేంజర్ సినిమా పైన పడ్డట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి.
దీంతో గేమ్ చేంజెస్ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందో క్లారిటీ రావడంలేదని అభిమానులు నిరుత్సాహంతో ఉన్నారు.. అభిమానులు మాత్రం తమ హీరో గేమ్ చేంజెర్ సినిమాని పూర్తి చేసి తదుపరి చిత్రం పైన ఫోకస్ పెట్టాలని తెలియజేస్తున్నారు.. గేమ్ చేంజెస్ సినిమా అయిపోయిన వెంటనే డైరెక్టర్ బుచ్చిబాబు దర్శకత్వంలో ఒక సినిమాని అనౌన్స్మెంట్ చేశారు రామ్ చరణ్ ఈ ఏడాది చివరిలో ఈ సినిమా షూటింగ్ మొదలు పెట్టబోతున్నట్లు సమాచారం. వచ్చే ఏడాది దసరాకు ఈ సినిమాని విడుదల చేసే విధంగా సన్నహాలు చేస్తున్నారు. మరి గేమ్ చేంజెర్ సినిమా పరిస్థితి ఏంటో చిత్ర బృందం క్లారిటీ ఇస్తే బాగుంటుంది..