ఆ హీరోతో నటించాలని ఉంది.. మనసులో మాట బయటపెట్టిన కీర్తి సురేష్?

praveen
ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా కొనసాగుతున్న వారిలో కీర్తి సురేష్ కూడా ఒకరు అన్న విషయం తెలిసిందే. తెలుగు చిత్ర పరిశ్రమకు హీరోయిన్గా పరిచయమైన ఈ ముద్దుగుమ్మ తక్కువ సమయంలోనే తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంది. అయితే ఇకఅప్పటివరకు కేవలం అడప దడప సినిమాలను చేస్తూ మిడ్ రేంజ్ హీరోయిన్గా కొనసాగిన కీర్తి సురేష్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన మహానటి సినిమా ద్వారా మాత్రం ఇక తెలుగు ప్రేక్షకులందరికీ బాగా దగ్గరైంది. ఈ సినిమాతో బ్లాక్ బస్టర్ కొట్టి స్టార్ హీరోయిన్ రేస్ లోకి వచ్చేసింది.


 ఇక ఆ తర్వాత కాలంలో కొన్ని లేడీ ఓరియంటెడ్ సినిమాలు చేసి చేతులు కాల్చుకుంది ఈ ముద్దుగుమ్మ. కానీ ఇప్పుడు కథలు ఎంపికలో ఆచీతూచి అడుగులు వేస్తూ వరుస విజయాలు సాధిస్తుంది అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఈ ఏడాది నాని సరసన నటించిన దసరా సినిమాతో సూపర్ హిట్ సాధించి మరోసారి జోరు చూపించింది. అటు తమిళం కన్నడంలో కూడా వరుస సినిమాలు చేస్తూ బిజీ బిజీగా ఉంది అని చెప్పాలి. అయితే ఇలా వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్న కీర్తి సురేష్ ఇటీవల తన మనసులో ఉన్న మాటను బయటపెట్టింది. ఒక క్రేజీ కాంబినేషన్లో నటించాలని ఉంది అంటూ చెప్పుకొచ్చింది.

 బాలీవుడ్ బాద్షా షారుఖాన్ హీరోగా సంజయ్ లీలా బాన్సాలి దర్శకత్వంలో ఒక సినిమా వస్తే అందులో నటించాలని ఉంది అంటూ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో తన మనసులో మాట బయట పెట్టింది కీర్తి సురేష్. తన సినీ కెరియర్ ముగిసేలోపు ఇక వెండితెరపై ఇద్దరి కాంబినేషన్లో వచ్చే సినిమాలో తనకు నటించే ఛాన్స్ దక్కాలని  కోరుకుంటున్నాను అంటూ చెప్పుకొచ్చింది. కాగా ప్రస్తుతం టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి.. హీరోగా నటించిన భోళా శంకర సినిమాలో మెగాస్టార్ చెల్లెలి పాత్రలో నటిస్తుంది ఈ హీరోయిన్. ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతుంది అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: