లోక నాయకుడు కమల్ హాసన్ హీరోగా దేశం గర్వించదగ్గ గొప్ప దర్శకులలో ఒకరు అయినటువంటి శంకర్ దర్శకత్వంలో ప్రస్తుతం ఇండియన్ 2 అనే భారీ బడ్జెట్ పాన్ మూవీ రూపొందుతున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో కాజల్ అగర్వాల్ ... రకుల్ ప్రీత్ సింగ్ లు కీలక పాత్రలలో కనిపించనుండగా ... అనిరుద్ రవిచంద్రన్ మూవీ కి సంగీతం అందిస్తున్నాడు. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ వారు ఈ మూవీ ని అత్యంత భారీ బడ్జెట్ తో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ చాలా రోజుల క్రితమే ప్రారంభం అయింది. కాకపోతే మధ్యలో కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ సినిమా షూటింగ్ కొంత కాలం పాటు ఆగిపోయింది.
ఆ తర్వాత తిరిగి మళ్లీ ఈ సినిమా షూటింగ్ ను ప్రారంభించారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ ఫుల్ స్పీడ్ గా జరుగుతుంది. ఇకపోతే ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ మూవీ కి మరో బాగం ఉండబోతునట్లు అందులో భాగంగా శంకర్ ఇప్పటికే ఇండియన్ 3 మూవీ కి సంబంధించిన కొన్ని సన్నివేశాలను కూడా చిత్రీకరించినట్లు ఒక వార్త వైరల్ అవుతుంది. ఈ వార్త ఎంత వరకు నిజమో చూడాలి. ఇది ఇలా ఉంటే ఇండియన్ 2 మూవీ కి భారీ అంచనాలు ఉన్న నేపథ్యంలో ఈ మూవీ యొక్క డిజిటల్ హక్కులను నెట్ ఫ్లిక్స్ సంస్థ దాదాపు 220 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసినట్లు ఒక వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.
ఇది ఇలా ఉంటే ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఇండియన్ 2 మూవీ కి సంబంధించిన షూటింగ్ దాదాపు కంప్లీట్ అయినట్లు తెలుస్తుంది. అలాగే ఈ మూవీ షూటింగ్ కంప్లీట్ కాగానే ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ పనులను కూడా ఈ మూవీ మేకర్స్ మొదలు పెట్టబోతున్నట్లు తెలుస్తోంది.