పెళ్లి కి రెడీ అవుతున్న హీరో శ్రీకాంత్ కూతురు...!!

murali krishna
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో హీరో శ్రీకాంత్ విలన్ గా కెరియర్ మొదలుపెట్టి ఆ తర్వాత ఫ్యామిలీ హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్న విషయం తెలిసిందే.ఇక సినిమాలలో నటిస్తున్నప్పుడే ప్రముఖ హీరోయిన్ ఊహ ను వివాహం చేసుకోగా వీరికి ఇద్దరు కొడుకులు, ఒక కూతురు జన్మించింది.ఇప్పటికే పెద్ద కొడుకు రోషన్ సినిమాలలోకి ఎంట్రీ ఇచ్చి హీరోగా సత్తా చాటుతున్న విషయం తెలిసిందే. నిర్మల కాన్వెంట్ సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన రోషన్ పెళ్లి సందD సినిమాతో భారీ పాపులారిటీ సొంతం చేసుకున్నారు. ఇప్పుడు మరొక సినిమాతో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నారు. ఇక కూతురు మేధ ,చిన్న కొడుకు రోహన్ చదువుకుంటున్నారు. త్వరలోనే వీరు కూడా ఇండస్ట్రీలోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇదిలా ఉండగా తాజాగా హీరో శ్రీకాంత్ ఇంట్లో పెళ్లి భాజలు మోగుతున్నట్లు వార్తలు రావడమే కాదు అందుకు సంబంధించిన ఫోటోలు కూడా నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ విషయం తెలిసి అప్పుడే హీరో శ్రీకాంత్ తన కూతురు కి పెళ్లి చేస్తున్నారా అంటూ వార్తలు బాగా తెరపైకి వచ్చాయి.
అయితే ఈ పెళ్లి తన కూతురుది కాదు అని.. స్వయానా తన తమ్ముడు అనిల్ మేక కూతురు వివాహ వేడుకలు అన్నట్లుగా తెలుస్తోంది. కూతురు వరస కాబోతున్న ఈ అమ్మాయి పెళ్ళికి హీరో శ్రీకాంత్ సతీసమేతంగా హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ గా మారుతున్నాయి.
ఇక శ్రీకాంత్ కెరియర్ విషయానికి వస్తే.. అఖండ సినిమాతో విలన్ గా సెకండ్ ఇన్నింగ్స్ ను మొదలుపెట్టిన ఈయన ఇప్పుడు గేమ్ చేంజర్, దేవర వంటి చిత్రాలలో నెగిటివ్ రోల్స్ పోషిస్తున్నారు. మరొకవైపు మోహన్లాల్ ప్రకటించిన వృషభ సినిమాలో శ్రీకాంత్ తో పాటు తన కొడుకు రోషన్ కూడా నటిస్తూ ఉండడం గమనార్హం. మరొకవైపు హీరో శ్రీకాంత్ తమ్ముడు అనిల్ మేక కూడా 1999లో ప్రేమించేది ఎందుకమ్మా అనే సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చారు. కానీ వర్క్ అవుట్ కాక నిర్మాతగా రెండు సినిమాలకు వ్యవహరించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: