బాత్రూమ్, వాష్ రూమ్, రెస్ట్ రూమ్ మూడు ఒకటే కాదు.. ఇది తెలుసుకోండి?

praveen
సాధారణంగా ప్రతి మనిషి రెగ్యులర్ గా ఎన్నో రకాల పదాలను వాడుతూ ఉంటాడు. కొన్ని కొన్ని సార్లు ఇతరులు మాట్లాడారని అలాంటి పదాలను వాడుతుంటే ఇంకొన్నిసార్లు తమకు తెలుసు అని కొని అలాంటి పదాలను వాడటం లాంటివి చేస్తూ ఉంటారు. ఇలాంటి పదాలలో వాష్ రూమ్, బాత్ రూమ్, రెస్ట్ రూమ్ పదాలు కూడా ఉంటాయి అని చెప్పాలి. అయితే ఇవి పలకడానికి మూడు పదాలు అయినప్పటికీ ఇక ఈ మూడింటికి కూడా ఒకే అర్థం వస్తుందని అందరూ అనుకుంటూ ఉంటారు. బాత్రూమ్ నే వాష్ రూమ్, రెస్ట్ రూమ్ అని పిలుస్తారని అందరూ అనుకుంటూ ఉంటారు.

 కానీ ఈ మూడు ఒకటే అనుకుంటే మాత్రం పొరపాటే. ఎందుకంటే అలా అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్లే. ఈ మూడు పదాలకు వేరువేరు అర్థాలు ఉన్నాయట. మరి ఈ మూడింటి మధ్య వ్యత్యాసం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.. సాధారణంగా రెండు దశాబ్దాల క్రితం చాలా ఇళ్లలో ఒకే బాత్రూం ఉండేది. అందులోనే స్నానం కూడా చేసేవారు. ఇప్పుడు వాష్ రూమ్ లు, బాత్రూంలు, ప్రత్యేక టాయిలెట్లను వారి ఆప్షన్ ప్రకారం ఏర్పాటు చేసుకుంటున్నారు. ఇంతకీ వీటి మధ్య వ్యత్యాసం ఏమిటంటే..

 బాత్రూమ్ : రోజు స్నానం చేసే చోటునే బాత్రూం అని అంటారు. ఇక్కడ కమోడ్ టాయిలెట్ సీట్ లేవని కాదు. బాత్రూం అంటే మీరు స్నానం చేయడానికి పూర్తి సౌకర్యాలు పొందే ప్రదేశం. ఇక పురుషులు మహిళలు ఇద్దరు కూడా ఈ బాత్రూమ్ ఉపయోగించుకోవచ్చు. అయితే టాయిలెట్స్ మాత్రం పురుషులకు స్త్రీలకు వేరువేరుగా ఉంటాయి అన్న విషయం తెలిసిందే.

 వాష్ రూమ్  : వాష్ రూమ్ అంటే వాష్ బేసిన్ తో పాటు టాయిలెట్ సీట్ అద్దం బట్టలు మార్చుకోవడానికి స్థలం మొదలైనవి లభించే ప్రదేశం. కానీ ఇక్కడ స్నానం చేసే సౌకర్యం ఉండదు. మాల్స్ ఆఫీసులు సినిమా హాల్స్ లాంటి ప్రదేశాలలో వాష్ రూమ్స్ ఉంటాయి. బాత్ రూమ్ ల ఉండవు ఎందుకంటే అక్కడ బాత్ టబ్ లేదా స్నానపు సౌకర్యాన్ని చూడలేము.

 రెస్ట్ రూమ్ : రెస్ట్ రూమ్ అంటే హాయిగా వెళ్లి విశ్రాంతి తీసుకునే ప్రదేశం అని చాలా మంది అనుకుంటారు. ఇది ఒక అమెరికన్ పదం. దీనికి అర్థం వాష్ రూమ్ అని. నిజానికి విదేశాల్లో ముఖ్యంగా అమెరికాలో వాష్ రూమ్ నూ రెస్ట్ రూమ్ లో పిలుస్తుంటారు. మనదేశంలో రెస్ట్ రూమ్ అనే పదానికి బదులుగా వాష్ రూమ్ అనే పదాన్ని ఎక్కువగా ఉపయోగిస్తారు. ఇక ఇప్పుడు చాలా ఫైవ్ స్టార్ హోటళ్లలో రెస్టారెంట్లలో ఇలా వాష్ రూమ్ అనే పదాన్ని రాసే ట్రెండ్ కొనసాగుతుంది అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: