"ఓ మంచి ఘోస్ట్ " నుంచి టీజర్ రిలీజ్ చేసిన మూవీ మేకర్స్..!!

murali krishna
టాలీవుడ్‌లో ప్రస్తుతం స్టార్ కమెడియన్ ఎవరంటే వెంటనే గుర్తొచ్చేది వెన్నెల కిషోర్‌. బ్రహ్మనందం తర్వాత ఆ స్థాయి కమెడియన్‌గా గుర్తింపు తెచ్చుకుని సినీ పరిశ్రమలో దూసుకుపోతున్నాడు.తెరపై వెన్నెల కిషోర్‌ కనిపించాడంటే చాలు.. నవ్వు దానంతట అదే వస్తుంది. అంతలా తన కామెడితో చేరువయ్యాడు. లెక్కలేనన్ని సినిమాలు కేవలం వెన్నెల కిషోర్‌ కామెడీతో నిలబడ్డాయనడంలో అతిశయోక్తి లేదు. కేవలం కమెడియన్‌గానే కాకుండా ఈ మధ్య నెగెటీవ్‌ పాత్రలతోనూ మెప్పిస్తున్నాడు. వెన్నెల కిశోర్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న చిత్రం ఓ మంచి ఘోస్ట్.మార్క్‌సెట్ నెట్‌వర్క్స్ బ్యానర్‌పై డా.అబినికా ఇనాబతుని నిర్మాణంలో ఈ సినిమా నిర్మిస్తుండగా అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నారు.
ఇటీవల హారర్ కామెడీ సినిమాలు బాగానే వర్కౌట్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే త్వరలో 'ఓ మంచి ఘోస్ట్' అనే హారర్ కామెడీ సినిమా రాబోతుంది.వెన్నెల కిషోర్, నందితా శ్వేత, షకలక శంకర్, నవమి గాయక్, నవీన్ నేని.. పలువురు ముఖ్య పాత్రల్లో శంకర్ మార్తాండ్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. మార్క్‌సెట్ నెట్‌వర్క్స్ బ్యానర్‌పై డా.అబినికా ఇనాబతుని నిర్మాణంలో ఈ సినిమా నిర్మిస్తుండగా అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నారు.
ఇప్పటికే 'ఓ మంచి ఘోస్ట్' సినిమా నుంచి ఓ సాంగ్, కాన్సెప్ట్ పోస్టర్ రిలీజ్ చేయగా తాజాగా టీజర్ రిలీజ్ చేసారు. టీజర్ భయపెడుతూనే నవ్వించింది. ఈ సినిమాలో నందితా శ్వేతా ఘోస్ట్ గా నటించింది. టీజర్ లో.. పూర్వ జన్మ జ్ఞానంతో మళ్లీ జన్మ ఎత్తే అవకాశం ఏ జీవికి కూడా ఉండదు.. దెయ్యాలకు మాత్రమే ఉంటుంది అనే ఆసక్తికర డైలాగ్‌తో మొదలుపెట్టారు. వెన్నెల కిషోర్, షకలక శంకర్ దయ్యలతో చేసే కామెడీ చూపించారు. ఈ టీజర్ మీరు కూడా చూసేయండి.ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది ఈ సినిమా. మరి త్వరలో థియేటర్స్ లో 'ఓ మంచి ఘోస్ట్(OMG)' ఎలా భయపెడుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: