ఆ బాలీవుడ్ ఛానల్ కి.. రేటింగ్స్ కోసం ఇంద్ర సినిమానే దిక్కైందట తెలుసా?

praveen
తెలుగు చిత్ర పరిశ్రమలో మెగాస్టార్ చిరంజీవికి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. దాదాపు మూడు దశాబ్దాల నుంచి ఇండస్ట్రిలో స్టార్ హీరోగా కొనసాగిన.. మెగాస్టార్ ఇక అటు రెండు దశాబ్దాల పాటు నెంబర్ వన్ హీరోగా హవా నడిపించారు అని చెప్పాలి. కామెడీ, యాక్షన్, ఫామిలీ డ్రామా ఇలా చెప్పుకుంటూ పోతే ఆయన ఏ జోనర్ కు సెట్ అవుతారు అని ప్రేక్షకులు కూడా డిసైడ్ చేయలేకపోయారు అంటే.. అన్ని జోనర్స్ లో అటు మెగాస్టార్ ఎంతలా అలరించారో అర్థం చేసుకోవచ్చు.

 రికార్డుల్లో నా పేరు ఎక్కడం కాదు. నా పేరు మీదే రికార్డ్స్ ఉంటాయి అంటూ చిరంజీవి వాల్తేరు వీరయ్య సినిమాలో ఒక డైలాగ్ చెపుతారు. నిజమే  చిరంజీవి కెరీర్ చూసుకుంటే ఇలా ఫ్యాన్స్ గర్వించదగ్గ రికార్డులు చాలానే ఉన్నాయి అని చెప్పాలి. అంతేకాదు ఇక భారతీయ చలనచిత్ర పరిశ్రమలో ఎవరు అందుకోనంత రెమ్యూనరేషన్ అందుకుని చరిత్ర సృష్టించారు మెగాస్టార్ చిరంజీవి. అయితేమెగాస్టార్ కెరియర్ లో ఎన్నో ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ మూవీలు ఉన్నాయి. ఇందులో ఇంద్ర సినిమా వెరీ స్పెషల్ అని చెప్పాలి. 2002లో విడుదలైన ఈ మూవీ 50 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ అందుకుని ఇక టాలీవుడ్ లో హైయెస్ట్ గ్రాసర్ మూవీగా నిలిచింది.

 అయితే మెగాస్టార్ ఇంద్ర సినిమా సృష్టించిన ఈ రికార్డును సౌత్ ఇండస్ట్రీలో బ్రేక్ చేయడానికి మూడేళ్ల సమయం పట్టింది. రజినీకాంత్ నటించిన చంద్రముఖి 2005లో ఈ రికార్డును బ్రేక్ చేసింది అని చెప్పాలి. తర్వాత నాలుగేళ్లకి పోకిరి సినిమా రికార్డు బ్రేక్ చేసింది. అయితే ఈ మూవీ బాలీవుడ్ లో కూడా సత్తా చాటింది. అయితే వెండితెర పైన  కాదు బుల్లితెరపై చిరు ఇంద్ర సినిమాకి బాలీవుడ్ లో విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది. కొన్ని చానల్స్ అయితే ఈ సినిమాను రేటింగ్ బాగా వస్తుందని రెండు వారాలకు ఒకసారి ప్రసారం చేస్తూ వచ్చారు. ఇంద్ర ది టైగర్ ఒక ఎవర్గ్రీన్ మూవీ.. మాకు ఎప్పుడు రేటింగ్స్ కావాలన్న ఆ సినిమాని టెలికాస్ట్ చేస్తామంటూ ఓ ఛానల్ సీఈఓ గతంలో ఒకసారి చెప్పారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: