వరుణ్ తేజ్ తీరు పై సందేహాలు !

Seetha Sailaja
మెగా ప్రిన్స్ గా మెగా అభిమానుల చేత పిలిపించుకునే వరుణ్ తేజ్ కు ‘ఫిదా’ మూవీ తరువాత చెప్పుకోతగ్గ హిట్ పడలేదు. దీనితో అతడి మార్కెట్ అంతంత మాత్రంగానే ఉంది. దీనికితోడు అతడు ఎంచుకునే దర్శకుల ప్రతిభ పై కొందరికి సందేహాలు ఉన్నప్పటికీ ఆవిషయాలను పరిగణలోకి తీసుకోకుండా వరుణ్ తేజ్ తనకు నచ్చిన కథ అయితే చాలు. ఆదర్శకుడి ట్రాక్ రికార్డుతో సంబంధం లేకుండా సినిమాలు ఓకె చేస్తున్నాడు.


యంగ్ హీరోలు అంతా సక్సస్ ఫుల్ దర్శకుల వైపు చూస్తుంటే వరుణ్ తేజ్ దీనికి భిన్నంగా ఫైయిల్యూర్ దర్శకులకు అవకాశాలు ఇస్తూ ఉండటం ప్రస్తుతం టాపిక్ ఆఫ్ ది టాలీవుడ్ గా మారింది. ఈయంగ్ హీరో లేటెస్ట్ గా నటిస్తున్న ‘గాండీవదారి అర్జున’ మూవీ వచ్చే నెలాఖరున విడుదల కాబోతోంది. ఈమూవీకి ప్రవీణ్ సత్తార్ దర్శకుడు.  



గత సంవత్సరం నాగార్జున తో ‘’ది ఘోస్ట్’ అనే ఫైయిల్యూర్ సినిమాను తీసిన ప్రవీణ్ సత్తార్ ట్రాక్ రికార్డును పట్టించుకోకుండా వరుణ్ తేజ్ అతడికి ఇచ్చిన అవకాశం ఎంతవరకు సక్సస్ చేయగలడు అన్న సందేహాలు కొందరికి ఉన్నాయి. అయితే ఈమూవీకి సంబంధించి లేటెస్ట్ గా విడుదలైన టీజర్ బాగుంది అంటూ కామెంట్స్ వస్తూ ఉండటంతో ఈ యంగ్ హీరో చేస్తున్న సాహసం సక్సస్ అయ్యే ఆస్కారం కనిపిస్తోంది. ఈసినిమా ఫలితం ఇంకా తెలియకుండానే వరుణ్ తేజ్ మరో ఫెయిల్ల్యూర్ దర్శకుదకి అవకాశం ఇచ్చాడు అతడే కరుణ కుమార్. ఈ సినిమా త్వరలో ప్రారంభం కాబోతోంది.



ఈదర్శకుడు గతంలో ‘శ్రీదేవి సోడా సెంటర్’ ‘కళాపురం’ అనే రెండు సినిమాలు తీసినప్పటికీ ఆ రెండు సినిమాలు సక్సస్ కాలేదు. మళ్ళీ ఈ దర్శకుడుకి వరుణ్ తేజ్ అవకాశం ఇవ్వడం ఇండస్ట్రీ వర్గాలకు షాక్ ఇస్తోంది. వరుణ్ తేజ్ గతంలో ఇచ్చిన ఒక ఇంటార్వ్యూలో తనకు కథ నచ్చేతే ఆ దర్శకుడి ట్రాక్ రికార్డు పట్టించుకోను అంటూ కామెంట్స్ చేశాడు. ఇప్పడు అదే విషయాన్ని వరుణ్ తేజ్ తూచా తప్పకుండా పాటిస్తున్నాడనుకోవాలి..


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: