ఆ క్షణం.. నేనెంతో బాధపడ్డా.. మెగాస్టార్ కూతురు షాకింగ్ కామెంట్స్?

praveen
తెలుగు సినీ ప్రేక్షకులందరికీ కూడా మెగాస్టార్ చిరంజీవి గురించి కొత్తగా పరిచయం అక్కర్లేదు. ఎందుకంటే ఆయన నటించిన సినిమాలే మెగాస్టార్ అంటే ఎవరో చెప్పకనే చెబుతూ ఉంటాయి. అయితే ఎలాంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన మెగాస్టార్ చిరంజీవి.. ఇక టాలీవుడ్ లో కొత్త ట్రెండ్ సృష్టించారు. అప్పటికే ఎంతో మంది స్టార్ హీరోలు ఇండస్ట్రీలో ఉన్న ఇక ప్రేక్షకుల చూపు మొత్తం తన వైపుకు తిప్పుకొని హవా నడిపించాడు. ఇక రెండు దశాబ్దాల పాటు తెలుగు చిత్ర పరిశ్రమలో నెంబర్ వన్ హీరోగా కొనసాగారు మెగాస్టార్ చిరంజీవి.


 ఇక ఇప్పుడు 60 ఏళ్ల వయసు దాటిపోతున్న ఇంకా యువ హీరోలకు పోటీ ఇస్తూ వరుసగా సినిమాలు చేస్తూ బిజీ బిజీగా కొనసాగుతూ ఉన్నారు అని చెప్పాలి. అయితే మెగాస్టార్ చిరంజీవి వారసులుగా ఎంతోమంది హీరోలుగా ఎంట్రీ ఇచ్చి రానిస్తున్నారు. ఎవరికి వారు ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నారు. కానీ మెగాస్టార్ వారసులుగా ఇండస్ట్రీలోకి నటిగా కాకుండా సరికొత్త ప్రొఫెషన్ లోకి అడుగుపెట్టింది చిరంజీవి పెద్ద కూతురు సుస్మిత. ప్రస్తుతం ఇండస్ట్రీలో కాస్ట్యూమ్ డిజైనర్ గా కొనసాగుతుంది. మొదట కేవలం చిరంజీవి సినిమాలకు కాస్ట్యూమ్ డిజైనర్ గా ఉన్న ఆమె.. ఇప్పుడు ఇతర హీరోల సినిమాలకి కూడా కాస్ట్యూమ్ డిజైనర్ గా పనిచేస్తుంది.


 అయితే కాస్ట్యూమ్ డిజైనర్ గా ఇండస్ట్రీ లోకి వచ్చిన సమయంలో తనపై వచ్చిన విమర్శలకు ఎంతగానో బాధపడ్డాను అంటూ ఇటీవల ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది సుస్మిత. ఇండస్ట్రీలో అంత ఈజీ కాదు.. ప్రతి రోజు యుద్ధం చేయాలి. కాస్ట్యూమ్ డిజైనర్ గా కెరియర్ ప్రారంభించినప్పుడు.. సోషల్ మీడియాలో వచ్చిన వార్తలు చూసి బాధపడ్డ.. కానీ అవేవీ పట్టించుకోకుండానే ముందుకు సాగాలి.. అలా అయితేనే ఏదైనా సాధించగలం.. ఇక స్టైలింగ్ విషయంలో ఏదైనా నచ్చకపోతే.. నాన్న నిర్మొహమాటంగా చెప్పేస్తారు అంటూ సుస్మిత చెప్పుకొచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: