పాన్ ఇండియా స్టార్ డైరెక్టర్ రాజమౌళి రూపొందించిన ఆర్ఆర్ఆర్ చిత్రం తెలుగోడి టాలెంట్‌ను మరోసారి ప్రపంచవ్యాప్తంగా చాటిచెప్పింది. వరల్డ్ వైడ్ పెద్ద బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచిన ఈ సినిమాలోని నాటునాటు పాటకు అయితే ఏకంగా అస్కార్ అవార్డు కూడా దక్కింది.ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 1200 కోట్లకు పైగా వసూళ్లు సాధించి బిగ్గెస్ట్ గ్లోబల్ హిట్ అయ్యింది. ఇక ముఖ్యంగా ఈ సినిమాలో నటించిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్‌లు ఏకంగా పెద్ద గ్లోబల్ స్టార్స్‌గా ఎదిగిపోయారు. దేశవ్యాప్తంగా కాకుండా విదేశాల్లో కూడా వీరి నటనకు ప్రశంసలు దక్కాయి.ప్రపంచవ్యాప్తంగా వీరి పేర్లు మార్మోగిపోయాయి. ఇక ఆర్ఆర్ఆర్ సినిమా వచ్చి ఇప్పటికి ఏడాదిన్నర పైనే కావస్తున్న ఈ సినిమాపై ఇంకా క్రేజ్ ఇంచు కూడా తగ్గలేదు. ఇక లేటెస్ట్‌గా ఈ సినిమాలో నటించిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌కు మరో అరుదైన గౌరవం దక్కింది.
ఫ్రాన్స్‌కి చెందిన ప్రముఖ మ్యాగజైన్ స్టార్ ఫిక్స్ కవర్‌పై హీరో రామ్ చరణ్ ఫోటోని ప్రముఖ హాలీవుడ్ స్టార్స్ ఫోటోలతో పాటు ప్రచురించారు. ఆర్ఆర్ఆర్ సినిమాలోని రామ్ పాత్ర ఫోటోను స్టార్ ఫిక్స్ కవర్ పేజీపై వేశారు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో బాగా వైరల్‌గా మారింది. ఈ ఫోటో చూసిన రామ్ చరణ్ ఫ్యాన్స్ ఎంతగానో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇది మా హీరో సత్తా అంటూ ఆ ఫోటోలను సోషల్ మీడియాలో తెగ షేర్ చేస్తున్నారు.ఇక మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం చేస్తున్న సినిమాల విషయాలకొస్తే తమిళ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో గేమ్ ఛేంజర్ షూటింగ్ జరుగుతోంది. ప్యాన్ ఇండియా స్థాయిలో వస్తున్న ఈ సినిమా వచ్చే వేసవికి విడుదలకానున్నట్లు సమాచారం తెలుస్తుంది. ఇక ఆ సినిమా తర్వాత ఉప్పెన దర్శకుడు బుచ్చిబాబుతో రామ్‌చరణ్ ఓ సినిమా తీయనున్నాడు. ఈ సినిమా నవంబర్ నెలలో మొదలయ్యే అవకాశం ఉంది.