ఆనంద్ దేవరకొండ, విరాజ్ అశ్విన్, వైష్ణవి చైతన్య లాంటి యువ నటులు నటించిన తాజా చిత్రం 'బేబీ'. యూత్ ఫుల్ ఎంటర్ టైనర్‌గా తెరకెక్కిన ఈ మూవీ డే 1 నుంచి పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది.సాయి రాజేష్ దర్శకత్వంలో మాస్ మూవీ మేకర్స్ బ్యానర్ మీద ఎస్‌కేఎన్ బేబీ మూవీని నిర్మించడం జరిగింది. జులై 14 వ తేదీన విడుదలైన బేబీ మూవీ అంచనాలకు మించి వసూళ్లని బాగా రాబడుతోంది.సాలిడ్ టాక్‌తో నిర్మాతలకు ఈ సినిమా వసూళ్ల వర్షం కురిపిస్తోంది. మంచి ఫీల్ గుడ్ లవ్ స్టోరీ కావడంతో ముఖ్యంగా యువత బేబీ సినిమాకు బాగా కనెక్ట్ అయ్యి బ్రహ్మరథం పతున్నారు. అందుకు తగ్గట్టే తెలుగు రాష్ట్రాలతో పాటు అమెరికాలో కూడా ఈ మూవీకి కలెక్షన్లు హోరెత్తుతున్నాయి. మొదటి రోజే ఏకంగా 7 కోట్లకు పైగా గ్రాస్ ని అందుకున్న బేబీ సినిమా వరుసగా రెండో రోజు కూడా ఏకంగా 7 కోట్లకి పైగానే గ్రాస్ ని రాబట్టింది. పైగా వీకెండ్‌కు తోడు బోనాల పండగ కూడా కలిసి రావడంతో ఆనంద్ దేవరకొండ సినిమా రెండు రోజుల్లో వరల్డ్ వైడ్ గా ఏకంగా 14.3 కోట్ల గ్రాస్ ని అందుకుంది.
ఈ విషయాన్ని బేబీ నిర్మాత ఎస్‌కేఎన్ సోషల్ మీడియా ద్వారా పంచుకుని ఎంతగానో మురిసిపోయాడు.బేబీ సినిమాపై ప్రేక్షకులు కురిపిస్తోన్న ప్రేమాభిమానాలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపాడు ప్రొడ్యూసర్ ఎస్‌కేఎన్. ఇంకా అలాగే మూడో రోజు కూడా ఈ సినిమాకి అడ్వాన్స్ బుకింగ్ అదిరిపోయాయని, ఈ రేంజ్ సక్సెస్ ఊహించలేదని నిర్మాత SKN హర్షం వ్యక్తం చేశాడు. ఇక ప్రస్తుతం తెలంగాణలో బోనాలు బాగా నడుస్తున్నాయి. అలాగే మరోవైపు మహావీరుడు, నాయకుడు సినిమాలు అరవ డబ్బింగ్ సినిమాలు కావడంతో బేబీ సినిమాకే ఓటేస్తున్నారు మన ప్రేక్షకులు.ఇప్పుడు అదే వసూళ్ల రూపంలో కనిపిస్తోంది. బేబీ సినిమాకు విజయ్ బుల్గానిన్ అందించిన స్వరాలు, బీజీఎం చాలా స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచాయి.అలాగే ఆనంద్, విరాజ్, వైష్ణవి నటనలకు యూత్ బాగా ఫిదా అవుతున్నారు.