నాయకుడు రివ్యూ: హీరో పెద్ద మైనస్.. వరస్ట్ యాక్టర్?

Purushottham Vinay
కోలీవుడ్ లో మంచి విజయం సాధించిన 'మామన్నన్' సినిమాను తెలుగులో 'నాయకుడు' పేరుతో అందించాయి సురేష్ ప్రొడక్షన్స్, ఏషియన్ మూవీస్.నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.



నాయకుడు చాలా మంచి స్టోరీ. అందరిని ఆలోచింపజేసే కథ.ఇది కుల వివక్ష నేపథ్యంలో సాగే కథ. ఈ సినిమాలో ఆలోచింపజేసే కథతో పాటు ప్రేక్షకుల్లో ఆసక్తి రేకెత్తించే.. కమర్షియల్ టచ్ ఉన్న కథనమూ ఉంది. ఇందులో  గూస్ బంప్స్ మూమెంట్స్ ఉన్నాయి. అందరూ కనెక్ట్ అయ్యే ఎమోషన్లు కూడా ఉన్నాయి. మంచి మెసేజ్ కూడా ఉంది. అయితే తెలుగు వారికి పెద్దగా అనిపించదు. ఎందుకంటే కథలో తమిళ నేటివిటీ పాళ్లు ఎక్కువ ఉండటం..ఇంకా పెద్ద మైనస్ ఏంటంటే  ఈ సినిమాలో హీరోగా నటించిన ఉదయనిది స్టాలిన్. 



అసలు అతడిని ఎందుకు ఈ సినిమాకి హీరోగా తీసుకున్నారో డైరెక్టర్ కే తెలియాలి.ఏ దశలోనూ కనెక్ట్ కాలేని హీరో ఈ సినిమాకి బిగ్ మైనస్. హీరో మాత్రం వరస్ట్ గా ఉన్నాడు.అస్సలు సూట్ కాలేదు. ఈ సినిమాకి నిజమైన హీరో ఎవరు అంటే వడివేలు మాత్రమే. ఆయన లేకుంటే ఈ సినిమా తమిళ్ లో ఆ మాత్రం కూడా హిట్ అయ్యుండేది కాదు.ఆయన పాత్ర.. నటన ఈ సినిమాలో మేజర్ హైలైట్. తనకున్న కామెడీ ఇమేజ్ నుంచి బయటికి వచ్చి ఆయన ఇచ్చిన పెర్ఫామెన్స్ అయితే మైండ్ బ్లోయింగ్ అనిపిస్తుంది. మొదటి సన్నివేశం నుంచి ఆ పాత్ర మీద ఏర్పడే ఆపేక్ష.. ప్రేక్షకులకి నచ్చుతుంది. అటు వైపు ఫాహద్ ఫాజిల్ విలన్ గా ఉండటం ప్లస్.



ఇక కథాకథనాల పరంగా కొంచెం వీక్ అనిపించిన చోటల్లా.. వీళ్లిద్దరూ తమ నటనతో సినిమాను నిలబెట్టే ప్రయత్నం గట్టిగా చేశారు. ఇలాంటి మంచి పెర్ఫామర్ల మధ్య ఉదయనిధి స్టాలిన్ లాంటి దరిద్రమైన ఎక్స్ ప్రెషన్ లెస్ హీరోను చూడాల్సి రావడమే విచారకరం. సినిమాలో ఎప్పుడూ ముభావంగా కనిపించడం తప్ప.. మనసులోని బాధను ఇంకా సంఘర్షణను చూపించేలా అతను నటించలేకపోయాడు. ఇలాంటి పాత్రలో ఏ ధనుష్ లాంటి హీరో అయితే ఎలా ఉండేదో అన్న ఫీలింగ్ ఖచ్చితంగా కలుగుతుంది. ఓవైపు వడివేలు ఇంకా ఫాహద్ తమ నటనతో సినిమా స్థాయిని పెంచే ప్రయత్నంలో ఉంటే..ఉదయ్ మాత్రం ఈ సినిమాని కిందికి లాగేస్తున్నట్లు అనిపిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: