SSMB -29:RRR .. బాహుబలి చిత్రాలకు మించి అనేలా..?
మహేష్ బాబు స్టార్డమ్ ను హాలీవుడ్ సెలబ్రిటీలకు ఏమాత్రం తగ్గకుండా ఉండేలా ఈ సినిమాని ప్లాన్ చేస్తున్నారు. తాజాగా ఒక అప్డేట్ తో క్లారిటీ ఇవ్వడం జరిగింది. వినిపిస్తున్న సమాచారం ప్రకారం రాజమౌళి మహేష్ కాంబినేషన్ సినిమా rrr చిత్రానికి మించి ఉండబోతోంది అంటూ రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్ తెలియజేయడం జరిగింది. అంతేకాకుండా రాజమౌళి rrr సినిమా సీక్వెల్ని తెరకెక్కించే ప్లాన్ లో ఉన్నారని ఇవి కూడా అతని పర్యవేక్షణలో వేరే డైరెక్టర్ తో తెరకెక్కించే అవకాశాలు ఉన్నాయని విజయేంద్రప్రసాద్ తెలియజేయడం జరిగింది. అయితే ఇందులో రామ్ చరణ్ ఎన్టీఆర్ నటిస్తూ ఉన్నట్లు తెలిపారు.
రాజమౌళి డ్రీమ్ ప్రాజెక్ట్ మహాభారత కూడా మహేష్ బాబు జంగిల్ అడ్వెంచర్ మూవీ తర్వాత తెరపైకి వచ్చే అవకాశం ఉందనే విధంగా హింట్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఇండస్ట్రీలో ఈ విషయమే టాక్ ఆఫ్ ది టౌన్ గా మారుతోంది మొత్తానికి విజయేంద్ర ప్రసాద్ ఒకేసారి మూడు చిత్రాల గురించి అప్డేట్ చెప్పడంతో అటు అభిమానులు ఊగుతున్నారు. ఇక మహేష్ బాబు గుంటూరు కారం సినిమా షూటింగ్ పూర్తి అవ్వగానే SSMB -29 చిత్రం షూటింగ్ మొదలు పెట్టబోతున్నట్లు తెలుస్తోంది ఈ ప్రాజెక్టును చాలా గ్రాండ్గా ప్రారంభించబోతున్నట్లు సమాచారం.