పాన్ ఇండియా చిత్రాల పైన అలాంటి వ్యాఖ్యలు చేసిన శ్రీను వైట్ల..!!

Divya
టాలీవుడ్ కామెడీ డైరెక్టర్ గా పేరు పొందారు డైరెక్టర్ శ్రీనువైట్ల. శ్రీనువైట్ల మొదటిసారి నీకోసం అనే సినిమాని 2001లో విడుదల చేసి మంచి విజయాన్ని అందుకున్నారు. ఆ తర్వాత ఆనందం, సొంతం, వెంకీ తదితర చిత్రాలతో మంచి పాపులారిటీ సంపాదించిన శ్రీను వైట్ల తన కెరియర్ లో ఎన్నో బ్లాక్బస్టర్ విజయాలను కూడా తెరకెక్కించి మంచి విజయాలను అందుకున్నారు. అయితే ఈ మధ్యకాలంలో శ్రీనువైట్ల పెద్దగా సినిమాలు సక్సెస్ కాలేకపోతున్నాయి. తన నుంచి ఎలాంటి సినిమా అప్డేట్లు కూడా రాకపోవడంతో అభిమానులు తీవ్రమైన నిరాశతో ఉన్నారు.

శ్రీను వైట్ల కెరియర్ లో తెరకెక్కించిన చిత్రాలలో దూకుడు బాద్షా ఆగడు బ్రూస్ లీ వంటి సినిమాలు ప్రేక్షకులను బాగానే అలరించాయి. ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్ లో విడుదల అయ్యి ఉంటే డైరెక్టర్ శ్రీనువైట్ల కెరియర్ మరొక లాగా ఉండేదని తెలియజేసినట్టు తెలుస్తోంది. దూకుడు చిత్రంతో భారీగా కలెక్షన్లు రాబట్టడమే కాకుండా టాప్ డైరెక్టర్గా కూడా పేరు పొందారు. సినిమాకి 2012లో ఉత్తమ స్క్రీన్పై రచయితగా కూడా పేరు సంపాదించారు. ఇవే కాకుండా నంది అవార్డులు కూడా అందుకున్నారు శ్రీనువైట్ల. మంచు విష్ణు తో కలిసి ఢీ సినిమా సీక్వెల్ని తెరకెక్కించబోతున్నట్లు గత కొన్ని సంవత్సరాల క్రితం ప్రకటించారు కానీ ఇప్పటివరకు ఈ సినిమా నుంచి ఎలాంటి అప్డేట్ మాత్రం ప్రకటించలేదు.
ఒకవైపు సినిమాల లేక సతమతమవుతున్న సమయంలో శ్రీనువైట్ల తన భార్య నుంచి విడిపోయినట్టుగా కూడా వార్తలు వినిపించాయి. శ్రీను వైట్లకు ముగ్గురు కుమార్తెలు. శ్రీను వైట్ల ఎక్కువగా కామెడీ చిత్రాలను తెరకెక్కిస్తూ ఉండడంతో ప్రతి సినిమాకి కూడా ఒకే లెవెల్లో కామెడీ ఉంటుందని వార్తలు వినిపిస్తూ ఉంటాయి.. మరి శ్రీను వైట్ల ఈసారి ఎలాంటి సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తారో చూడాలి మరి. చివరిగా 2018లో రవితేజ తోనే అమర్ అక్బర్ ఆంటోనీ సినిమాని తెరకెక్కించి ఘోరమైన డిజాస్టర్ ని చవిచూశారు. దీంతో ఒక్కసారిగా ఈయన సినీ కెరియర్ డౌన్ అయిపోయిందని చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: