బోల్డ్ కామెంట్స్ చేసిన అనసూయ...!!

murali krishna
తెలుగు బుల్లితెరపై హాట్ యాంకర్ గా పేరు పొందింది అనసూయ (Anasuya). యూత్లో మరింత క్రేజ్ సంపాదించుకున్న ఈమె ఇలాంటి క్రేజ్ తోనే పలు సినిమాలలో కూడా నటించి మంచి పాపులారిటీ సంపాదించింది.సోషల్ మీడియాలో హాట్ ఫోటోలతో బాగా ఫేమస్ అయిన అనసూయ ఒకవైపు సినిమాలలో మరొకవైపు సోషల్ మీడియాలో తెగ బిజీగా ఉంటోంది .ఇటీవల యాంకర్ పోస్ట్ కి కూడా గుడ్ బై చెప్పేసింది అనసూయ. తాజాగా విమానం సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడం జరిగింది. ఈ సినిమాలో కూడా ఈమె వేశ్య పాత్రలో నటించింది.
అప్పుడప్పుడు అభిమానులతో కూడా చిట్ చాట్ చేస్తూ చాలా సన్నిహితంగా ఉంటుంది. సినిమాల షూటింగ్లో గ్యాప్ దొరికితే చాలు ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తూ ఉంటుంది అనసూయ. అందుకు సంబంధించిన ప్రతి ఫోటోలను సైతం సోషల్ మీడియాలో షేర్ చేస్తూనే ఉంటుంది. ఈ క్రమంలోని అనసూయ వీకెండ్ మోడ్ లో బాగా ఎంజాయ్ చేస్తున్నట్లుగా తెలియజేస్తూ.. తన డే ఎలా ప్రారంభమవుతుంది? ఎలా ముగుస్తుంది? అనే విషయాన్ని తెలియజేయడం జరిగింది. అనసూయకు హెల్తీ బ్రేక్ ఫాస్ట్ చేయడం అంటే చాలా ఇష్టమని నిద్ర అంటే మరింత ఇష్టమని తెలిపింది.
ప్రతిరోజు రాత్రి తాను నిద్రపోయేది ఉదయం బ్రేక్ ఫాస్ట్ కోసమే అంటూ తెలియజేయడం జరిగింది. ఎర్లీ మార్నింగ్ లుక్ కి సంబంధించి పలు ఫోటోలను షేర్ చేయడం జరిగింది. ప్రస్తుతం ఈ ఫోటోలు సైతం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.. విమానం సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన అనసూయ ప్రస్తుతం పలు చిత్రాల షూటింగ్లో బిజీగా ఉన్నది. ప్రస్తుతం అల్లు అర్జున్, రష్మీక నటిస్తున్న పుష్ప-2 సినిమా షూటింగ్లో అనసూయ పాల్గొనబోతున్నట్లు సమాచారం.
పుష్ప చిత్రంలో అనసూయ దాక్షాయిని పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే.. ఇప్పటికే మొదటి భాగం విడుదలై మంచి పాపులారిటీ సంపాదించింది ఈ సినిమాని కూడా పాన్ ఇండియా లెవెల్ లోకి విడుదల చేయడం జరిగింది. ఇప్పుడు పుష్ప-2 లో అనసూయ కీలకమైన పాత్రలో నటించబోతున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ప్రతి పాత్ర కూడా అనసూయ చుట్టు తిరిగేలా ఉండబోతుందని వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. ప్రస్తుతం అనసూయ ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసిన ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: