ఆ యాడ్ లోకి ఫస్ట్ టాలీవుడ్ హీరోగా ఎంట్రీ ఇచ్చిన తారక్...!!

murali krishna
సోషల్ మీడియా అభివృద్ధి చెందిన తర్వాత ఎన్నో సరికొత్త యాప్స్ అందుబాటులోకి రావడంతో చాలామంది సెలబ్రిటీలు వివిధ ఖాతాలను ఓపెన్ చేస్తూ పెద్ద ఎత్తున అభిమానులకు దగ్గరవుతున్నారు.ఈ క్రమంలోనే ఇప్పటికే ఇంస్టాగ్రామ్ ఫేస్ బుక్  సోషల్ మీడియా వంటి వాటి ద్వారా సెలబ్రిటీలు ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నారు. అయితే తాజాగా మరికొత్త యాప్ అందుబాటులోకి వచ్చింది. పోటీగా మెటా అధినేత జూకర్ బర్గ్ సరికొత్తగా ‘థ్రెడ్స్’ యాప్‌ అందుబాటులోకి తీసుకువచ్చారు. థ్రెడ్స్ యాప్ ప్లే‌స్టోర్‌లో అందుబాటులోకి వచ్చిన తొలి రెండు గంటల్లోనే రెండు మిలియన్ల మంది, నాలుగు గంటల్లో ఐదు మిలియన్ల మంది డౌన్‌లోడ్‌లు చేసుకున్నారు.
ఈ విధంగా ఈ యాప్ డౌన్లోడ్ చేసుకునే వారి సంఖ్య నిమిషం నిమిషానికి అధికమవుతోంది. అయితే తాజాగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ సైతం ఈ థ్రెడ్స్ యాప్ లోకి అడుగు పెట్టారని తెలుస్తోంది. ఇలా ఈ సరికొత్త ఆప్ లోకి అడుగుపెట్టిన తొలి బాలీవుడ్ హీరోగా ఎన్టీఆర్ గుర్తింపు సంపాదించుకున్నారు. ఈ విధంగా ఎన్టీఆర్ థ్రెడ్స్ యాప్ లో జాయిన్ అవ్వడంతో ఎన్టీఆర్ అభిమానులంతా ఎంతో సంతోషం వ్యక్తం చేస్తూ వెంటనే వారు కూడా ఈ యాప్ ని డౌన్ లోడ్ చేసుకొని ఎన్టీఆర్ ని ఫాలో అవుతున్నారు. ఇక ఎన్టీఆర్ ఈ సరికొత్త యాప్ లోకి అడుగుపెట్టిన కొంత సమయానికి ఈయనకు విపరీతమైన ఫాలోవర్స్ పెరిగిపోయారు.ఇప్పటికే ఇంస్టాగ్రామ్ సోషల్ మీడియా వంటి వాటి ద్వారా అభిమానులను సందడి చేస్తున్నటువంటి ఎన్టీఆర్ ఇకపై ఈ యాప్ ద్వారా కూడా తన సినిమాలకు సంబంధించిన అప్డేట్స్ విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ యాప్ సోషల్ మీడియా , ఇన్‌స్టాగ్రామ్ ఫీచర్స్ కలగలిసి ఉంది. ఇక ఎన్టీఆర్ సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం ఈయన కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న దేవర సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పనులను జరుపుకుంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: