24 గంటల్లో అత్యధిక వ్యూస్ ను సాధించిన టాలీవుడ్ టీజర్లు ఇవే..!

Pulgam Srinivas
24 గంటల్లో అత్యధిక వ్యూస్ ను సాధించిన టాప్ 5 టాలీవుడ్ మూవీస్ టీజర్ ఏవో తెలుసుకుందాం.

రెబల్ స్టార్ ప్రభాస్ కొంత కాలం క్రితం రాధే శ్యామ్ అనే సినిమాలో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ మోస్ట్ హాటెస్ట్ బ్యూటీ పూజా హెగ్డే ప్రభాస్ సరసన హీరోయిన్ గా నటించగా ... రాధాకృష్ణ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. ఇది ఇలా ఉంటే ఈ మూవీ టీజర్ కు విడుదల అయిన 24 గంటల్లో 42.67 మిలియన్ వ్యూస్ దక్కాయి .

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా కీర్తి సురేష్ హీరోయిన్ గా పరుశురామ్ దర్శకత్వంలో రూపొందిన సర్కారు వారి పాట సినిమా టీజర్ విడుదల 24 గంటల్లో 23.06 మిలియన్ వ్యూస్ ను దక్కించుకుంది.

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరో గా రష్మిక మందన హీరోయిన్ గా సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన పుష్ప మూవీ టీజర్ కు విడుదల అయిన 24 గంటల్లో 22.52 మిలియన్ వ్యూస్ దక్కాయి.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ... సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ హీరోలుగా రూపొందిన "బ్రో" మూవీ టీజర్ కు విడుదల 24 గంటల్లో 20.50 మిలియన్ వ్యూస్ దక్కాయి. ఇది ఇలా ఉంటే ఈ మూవీ కి సముద్ర ఖని దర్శకత్వం వహించగా ... తమ ఈ మూవీ కి తమన్ సంగీతం అందించాడు. ఈ మూవీ ని జూలై 28 వ తేదీన విడుదల చేయనున్నారు.

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా రష్మిక మందన హీరోయిన్ గా అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన సరిలేరు నెక్కెవరు మూవీ టీజర్ కు విడుదల అయిన 24 గంటల్లో 14.64 మిలియన్ వ్యూస్ దక్కాయి.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: