కీర్తి సురేష్ మొదటి సంపాదన ఎంతో తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే..?
ఇటీవల నాని సరసన దసరా సినిమాలో కూడా డి గ్లామరస్ పాత్ర పోషించి అందరినీ ఆకట్టుకున్న ఈ ముద్దుగుమ్మ గురించి కొన్ని విషయాలు ఇప్పుడు వైరల్ గా మారుతున్నాయి. ఇదిలా ఉండగా కీర్తి సురేష్ మొదటి సంపాదన ఎంత అన్న విషయం వైరల్ గా మారుతుంది. బాలనటిగా పనిచేసినప్పుడు ఆమె మొదటి చెక్కు అందుకుందట. అయితే ఆ చెక్ నేరుగా తన తండ్రికి ఇచ్చిందని.. ఆ తర్వాత కాలేజీలో ఒక ఫ్యాషన్ షోలో పాల్గొని అక్కడ తొలి జీతం అందుకుందని సమాచారం.
ఇకపోతే అదే తన తొలి సంపాదన అని.. అందుకు కేవలం 500 రూపాయలు మాత్రమే లభించాయి అని ఒక ఇంటర్వ్యూలో వెల్లడించింది. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా దూసుకుపోతున్న ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు ఒక్కో సినిమాకు ఏకంగా రూ .3కోట్ల వరకు పారితోషకం తీసుకుంటుంది. ప్రస్తుతం కీర్తి సురేష్ చిరంజీవి నటిస్తున్న భోళా శంకర్ సినిమాలో చిరంజీవికి చెల్లి పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇక అవకాశం రావాలి కానీ పాత్ర మంచిదైతే క్యారెక్టర్ ఆర్టిస్టుగా చేయడానికి కూడా ఏమాత్రం వెనుకాడడం లేదు ఈ ముద్దుగుమ్మ. ఏది ఏమైనా కీర్తి సురేష్ మరింత పాపులారిటీ దక్కించుకుంటోందని చెప్పవచ్చు.