ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకుండా సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి స్టార్ హీరోగా మారిన మాస్ మహారాజ రవితేజ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. మొదట చిన్న చిన్న పాత్రలు చేసుకుంటూ వచ్చిన మాస్ మహారాజా రవితేజ ఇప్పుడు ఎవరికి అందనంత ఎత్తులో స్టార్ హీరోగా నిలిచాడు. అయితే ఈనకి సంబంధించిన ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియా వేదిక వైరల్ అవుతుంది. అది ఏంటంటే రవితేజ ఇంత పెద్ద స్టార్ హీరో కావడానికి గల ముఖ్య కారణం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అని అంటున్నారు. అయితే రవితేజను స్టార్ హీరోని చేసిన సినిమా విక్రమార్కుడు.
అప్పటివరకు యావరేజ్ హీరోగా ఉన్న రవితేజ ఒక్క సినిమాతోనే ఓవర్ నైట్ స్టార్ హీరోగా తిరుగులేని క్రాక్ మరియు స్టార్డంని అందుకున్నాడు. ఇక రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా రవితేజ కెరీర్ ను ఊహించని స్థాయికి తీసుకువెళ్ళింది. అయితే నిజానికి ఈ సినిమా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేయవలసింది. అయితే రాజమౌళి ఈ సినిమాను పవన్ కళ్యాణ్ దృష్టిలో పెట్టుకొని కథను రాయడం జరిగింది. ఎలాగైనా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో ఈ సినిమా చేయాలని ఈ కథను సిద్ధం చేశాడట రాజమౌళి. కానీ అప్పటికి పవన్ కళ్యాణ్ చేతిలో సుమారుగా ఐదు సినిమాలు ఉన్నాయి.
కద బాగున్నప్పటికీ ఆ సినిమాలో చేయలేను అంటూ రాజమౌళికి చెప్పాడట పవన్ కళ్యాణ్. దాంతో ఎంతో నిరాశ పడ్డాడట రాజమౌళి వెంటనే ఈ కథను రవితేజ దగ్గరకు తీసుకువెళ్తే బాగుంటుందని ఈ కథకు రవితేజ అయితే చాలా పర్ఫెక్ట్ గా అవుతాడని ఒకసారి ఆలోచించండి అంటూ పవన్ కళ్యాణ్ రాజమౌళికి చెప్పాడట. దాంతో రాజమౌళి ఆలోచించకుండా ఓకే చేశారట రాజమౌళి. ఇక రవితేజ పోలీస్ ఆఫీసర్ పాత్రలో జనాలు చూస్తే చాలా కొత్తగా ఉంటుందని భావించారట రాజమౌళి .వెంటనే రవితేజతో సినిమా స్టార్ట్ చేశారట. ఇక రాజమౌళి మరియు రవితేజ కాంబినేషన్లో వచ్చిన ఈ సినిమా ఇండస్ట్రీస్ రికార్డులను మొదలు కొట్టింది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. అలా పవన్ కళ్యాణ్ రిజెక్ట్ చేసిన సినిమాను రవితేజ చేశారు. అంతేకాదు పవన్ చేసిన సహాయం వల్ల రవితేజ ఈరోజు ఆ సినిమాతో స్టార్ హీరోగా మారాడు అనడంలో ఎటువంటి సందేహం లేదు ..!!