సూపర్ హిట్ కాంబో.. బన్నీ డబుల్ హ్యాట్రిక్ కొట్టేనా..?

Divya
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబినేషన్లో వచ్చిన చిత్రాలలో జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి, అలా వైకుంఠపురం సినిమాలు బ్లాక్ బాస్టర్ విజయాలను అందుకున్నాయి. గురు పౌర్ణమి సందర్భంగా వీరీ కలయికలో నాలుగవ సినిమాని ప్రకటించడం జరిగింది. త్రివిక్రమ్ యొక్క అద్భుతమైన కథనాలు అల్లు అర్జున్ డైలాగ్ యాక్టింగ్ ప్రతి సినిమాకి కూడా గుర్తుండిపోయేలా ఉంటాయి. ప్రముఖ నిర్మాణ సంస్థ హారిక హాసిని క్రియేషన్ బ్యానర్ పై ఈ సినిమాని నిర్మిస్తూ ఉన్నట్లు తెలుస్తోంది. అందుకు సంబంధించి ఒక అప్డేట్ ను సహిత తెలియజేయడం జరిగింది చిత్ర బృందం.

అల్లు అర్జున్, త్రివిక్రమ్ కలయికలో సినిమా రాబోతోందని తెలిసి అభిమానులు చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నారు. అయితే ఈసారి ఈ నాలుగవ సినిమా అదే స్థాయిలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించబోతున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ సినిమాలో గీత ఆర్ట్స్ బ్యానర్ కూడా నిర్మాణంలో భాగం కాబోతున్నట్లు తెలుస్తోంది. అల్లు అర్జున్ త్రివిక్రమ్ కాంబినేషన్లో రాబోతున్న నాలుగవ సినిమా అని అధికారికంగా ప్రకటించడంతో అభిమానులు తెగ సంబరపడిపోతున్నారు. తాజాగా అనౌన్స్మెంట్ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతోంది.

భారీ స్థాయిలో త్రివిక్రమ్ అల్లు అర్జున్ కాంబినేషన్లు సినిమాలు విజయాలు అందుకోవడంతో ఈ సినిమా కూడా ఖచ్చితంగా బ్లాక్ బాస్టర్ విజయం అవుతుంది అంటూ అభిమానులు నమ్మకాన్ని తెలియజేస్తున్నారు. అయితే ఈ సినిమాకి సంబంధించి నటీనటుల వ్యవహారం సాంకేతిక నిపుణుల వ్యవహారంపై చిత్ర బృందం ఇంకా క్లారిటీ ఇవ్వలేదు.మరి త్వరలోనే ఈ విషయంపై చిత్ర బృందం క్లారిటీ ఇస్తుందేమో చూడాలి మరి. ఇక అల్లు అర్జున్ సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో పుష్ప-2 సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నారు ఈ సినిమా పూర్తి అయిన వెంటనే త్రివిక్రంతో సినిమా చేయబోతున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ చిత్రం పాన్ ఇండియా లెవల్లో నిర్మిస్తున్నారా లేదా అనే విషయంపై ఇంకా క్లారిటీ రాలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: