అతి పెద్ద నిర్ణయం తీసుకున్న మల్టీప్లెక్స్ థియేటర్ సంస్థలు.. ఆనందంలో ఫ్యాన్స్..!!

Divya
ఏ ఇండస్ట్రీలో నైనా స్టార్ హీరోల సినిమాలు విడుదలవుతున్నాయి అంటే అభిమానులు చేసే హంగామా గురించి చెప్పాల్సిన పనిలేదు ..ముఖ్యంగా థియేటర్ల వద్ద నాన రచ్చ చేస్తూ ఉంటారు..హైదరాబాదులో ప్రసాద్ మల్టీప్లెక్స్ యాజమాన్యం తాజాగా ఒక కీలకమైన నిర్ణయాన్ని తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇకపై కొంతమంది యూట్యూబ్ ఛానల్స్ థియేటర్ వద్ద ఆవరణలోకి తీసుకురాకుండా ఉండేందుకు పలు విధాల నియంత్రణను పాటించబోతున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా కొత్త సినిమాలు విడుదలైనప్పుడు థియేటర్ల వద్ద పబ్లిక్ టాక్ తీసుకోవడం పై అనుమతి నిరాకరించడం చేసే విధంగా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే మల్టీప్లెక్స్ గేటు లోపలికి మాత్రం యూట్యూబ్ చానల్స్ వారు కెమెరాలను సైతం తీసుకురానివ్వడం లేదని సమాచారం.. ఈ నిర్ణయం పైన పలువురు సినీ ప్రముఖుల సైతం ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.

అయితే ప్రసాద్ మల్టీప్లెక్స్ ల్యాబ్ ఈ నిర్ణయం తీసుకోవడం వెనుక ఇటీవల జరిగిన ఒక గొడవ సంఘటన కారణంగానే ఇలాంటి నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఆది పురుష్ సినిమా విడుదల సమయంలో ఒక ప్రేక్షకుడు తమ అభిప్రాయాన్ని డైరెక్ట్ గా తెలియజేశారు. దీంతో అక్కడ ఉన్న కొంతమంది అభిమానులు సైతం అతనిపైన తీవ్రంగా దాడికి పాల్పడడం జరిగింది. ఇదంతా కేవలం థియేటర్ ఆవరణంలోనే జరగడంతో ఇందుకు సంబంధించిన వీడియో తెగ వైరల్ గా మారడం జరిగింది. దీంతో పలువురు నేటిజెన్లు సైతం ఆగ్రహాన్ని తెలియజేశారు అయితే భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా ఉండేందుకు తగిన నిర్ణయం తీసుకుంటోంది థియేటర్లో యాజమాన్యం సంస్థ.

ఏదైనా ఒక కొత్త సినిమా విడుదల అయ్యిందంటే చాలు హైదరాబాదులో ప్రసాద్ ఐమాక్స్ థియేటర్ వద్ద ఎన్నో యూట్యూబ్ ఛానల్ రివ్యూల కోసం వేచి చూస్తూ ఉంటారు.మొదటిరోజు ఫస్ట్ షో చూసిన ప్రేక్షకుల ముందుకు మైకు పెట్టి మరి వారి యొక్క అభిప్రాయాలను సైతం తెలుసుకునేందుకు పలు ప్రయత్నాలు చేస్తూ ఉంటారు.. కొంతమంది రివ్యూ ఇవ్వడం ఇష్టం లేక పక్కకి తప్పుకోగా మరి కొంతమంది అభిప్రాయాలను తెలియజేస్తూ ఉంటారు. ఇక మీదట ఇలాంటివి జరగబోవు అని ప్రసాద్ ఐమాక్స్ థియేటర్ యాజమాన్యం తెలియజేయడంతో పలువురు అభిమానులు సైతం సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: