ఫస్ట్ డేట్ లోనే శృంగారంపై.. తమన్నా ఇంట్రెస్టింగ్ కామెంట్స్?

praveen
గత కొంతకాలం నుంచి మిల్కీ బ్యూటీ తమన్న వార్తల్లో ఎక్కువగా హాట్ టాపిక్ గా మారిపోతుంది అన్న విషయం తెలిసిందే  దీనికి కారణం ఇక బాలీవుడ్ నటుడు విజయ్ వర్మతో ఆమె డేటింగ్ లో మునిగి తేలుతూ ఉండడమే. మొన్నటి వరకు వీరిద్దరి డేటింగ్ సంబంధించిన వార్తలు పుకార్లుగానే మిగిలిపోయాయి. కానీ ఇటీవలే వీరిద్దరూ ఇక డేటింగ్ గురించి స్పందిస్తూ వీరిద్దరి ప్రేమ నిజమే అంటూ క్లారిటీ ఇవ్వడంతో ఇక వీరి ప్రేమాయణం గురించి వార్తలు అటు సోషల్ మీడియాలో మరింత ఊపందుకున్నాయి  అని చెప్పాలి. అయితే ఇక ఇటీవలే ఈ ఇద్దరు కూడా కలిసి నటించిన లస్ట్ స్టోరీస్ 2 వెబ్ సిరీస్ లో ఏకంగా రొమాన్స్ తో రెచ్చిపోవడం కూడా హాట్ టాపిక్ గా మారిపోయింది.

 ఇకపోతే ఇటీవల  ఈ వెబ్ సిరీస్ ప్రమోషన్స్ లో బిజీ బిజీగా ఉన్నారు ఈ ఇద్దరు. ఇక ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ జోడి ఫస్ట్ డేట్ లోనే శృంగారం గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఫస్ట్ డేట్ లోనే శృంగారం గురించి మీ అభిప్రాయం ఏంటి అంటూ యాంకర్ ప్రశ్నించింది. ఈ క్రమంలోనే తాను ఎప్పుడు ఫస్ట్ డేట్ లోనే శృంగారంలో పాల్గొనలేదు అంటూ తమన్న సమాధానం చెప్పింది. కానీ వెంటనే విజయ్ వర్మ స్పందిస్తూ ఫస్ట్ డేట్ లో శృంగారం ఎంతో అద్భుతంగా ఉంటుంది అంటూ ఆన్సర్ ఇచ్చాడు.

 అదే సమయంలో ఇక లస్ట్ స్టోరీస్ 2లో నీనా గుప్తా చెప్పినట్లు.. పెళ్లికి ముందు టెస్టు డ్రైవింగ్ పై మీ ఒపీనియన్ ఏంటి అంటూ ప్రశ్నించగా.. మరోసారి ఇంట్రెస్టింగ్ ఆన్సర్ చెప్పారు. నీనా ఏదైనా కరెక్ట్ గానే చెబుతారు అంటూ ఆసక్తికర సమాధానం చెప్పారు. ప్రస్తుతం ఇక ఇద్దరి జోడి చెప్పిన ఆన్సర్స్ కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోతున్నాయి అని చెప్పాలి. అయితే లస్ట్ స్టోరీస్ 2 లో విజయవర్మతో కిస్ సీన్లో నటించడానికి ముందు రెండు దశాబ్దాలుగా ఫాలో అవుతున్న నో కిస్ పాలసీని పక్కన పెట్టేసింది తమన్న  కాలానుగుణంగా వ్యక్తుల్లో మార్పు వస్తుంది అన్న విషయాన్ని తమన్న నిరూపించింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: