సైతాన్ లో తల్లి పాత్ర పోషించిన ఈ బోల్డ్ బ్యూటీ గురించి తెలిస్తే షాక్ అవుతారు..!?

Anilkumar
మహి వి రాఘవ దర్శకత్వంలో ఇటీవల వచ్చిన వెబ్ సిరీస్ సైతాన్. ఇందులో మెయిన్ లీడ్ బాలి తల్లిగా నటించిన సావిత్రి అందరికీ తెలిసే ఉంటుంది. అయితే మొదట ఈ సిరీస్ ట్రైలర్లో ఈమె చాలా పద్ధతిగా కనిపించింది. కానీ సీరియస్ ఫస్ట్ ఎపిసోడ్లో మాత్రం ఒక పోలీస్కి ఉంపుడుగత్తగా ఉంటూ చాలా సన్నివేశాలు బోల్డ్ గా నటించి షాక్ ఇచ్చింది.అంతేకాదు ఈ సిరీస్ తో ఒక్కసారిగా ఫుల్ క్రేజ్ తెచ్చుకుంది ఈ సీనియర్ నటి. అయితే ఇందులో నటించిన సావిత్రి ఎవరు ఈమె బ్యాక్ గ్రౌండ్ ఏంటి అన్న ప్రశ్న ఇప్పుడు అందరిలో నెలకొంది. అయితే ఈ వెబ్ సిరీస్ లో హీరో తల్లిగా సావిత్రి 

పాత్రలో నటించిన ఈమె షెల్లీ కుమార్ అలియాస్ షెల్లీ కిషోర్. అయితే ఒకప్పుడు ఈమె మలయాళం సీరియల్స్ లో నటించి మంచి పేరు తెచ్చుకుంది. ఇక ఈ సీరియస్ తో ఇంతటి గుర్తింపు తెచ్చుకున్న ఈమె ఆగస్టు 18 1983లో దుబాయ్లో పుట్టింది. ఒకసారి మలయాళ మనోరమ న్యూస్ పేపర్లో కనడి ఫిలిం పెడుతున్న సినిమాలకి కాస్టింగ్ కాల్ యాడ్ ఇచ్చారు. ఇక అది చూసి ఆమె ఫ్రెండ్ ఆ విషయాన్ని తనకు చెప్పింది. వెంటనే ఆమె అప్లై చేసి ఆడిషన్స్ ఇచ్చి మంచి ఛాన్స్ అందుకుంది. కానీ ఈమె చేసిన ఆ సినిమా విడుదల కాలేదు. ఈ క్రమంలోనే ఆమెకి పురుషోత్తం సీరియల్

 డైరెక్టర్ ద్వారా చిత్ర శలభం అనే సీరియల్ లో అవకాశం వచ్చింది. దాని తర్వాత కుట్టు కుడుంబం సీరియల్ లో కూడా ఏమైనా నటించింది. దాని తర్వాత ధని అనే సీరియల్ ద్వారా ప్రేక్షకులకు మరింత దగ్గర అయ్యింది ఈమె. ఆ తర్వాత పెద్ద స్టార్ గా ఎదిగింది. ఇక 2009లో మెగాస్టార్ మమ్ముట్టి కేరళకి సినిమాలో నటించి సినిమాల్లోకి సైతం ఎంట్రీ ఇచ్చింది ఆమె. ఆ సినిమాతో ప్రేక్షకులకి మరింత దగ్గర అయింది. తాజాగా ఇప్పుడు సైతాన్ సిరీస్ తో మరింత గుర్తింపు తెచ్చుకుంది ఈమె. ఇక ఈ సిరీస్ లో ఈమె ఇంతలా బోల్డ్ సీన్స్ లో నటించడంతో ఈమెపై ఒక రకంగా నెగిటివ్ కామెంట్ సైతం చాలానే వచ్చాయి..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: