సూపర్ స్టార్ రజనీ కాంత్ హీరోగా పి. వాసు దర్శకత్వంలో కొన్ని సంవత్సరాల క్రితం చంద్రముఖి అనే మూవీ రూపొందిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో రజనీ కాంత్ సరసన నయన తార హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ లో ప్రభు ... జ్యోతిక కీలక పాత్రల్లో నటించారు. ఈ మూవీ తమిళ ... తెలుగు భాషల్లో విడుదల అయ్యి ఈ రెండు భాషల్లో కూడా ఈ సినిమా భారీ బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకుంది. ఇలా చంద్రముఖి సినిమా అద్భుతమైన విజయం సాధించడంతో ప్రస్తుతం దర్శకుడు పి. వాసు రాఘవ లారెన్స్ హీరోగా చంద్రముఖి 2 అనే పేరుతో ఒక మూవీ ని రూపొందిస్తున్నాడు.
ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన చాలా బాగం షూటింగ్ పూర్తి అయినట్లు తెలుస్తోంది. ఇకపోతే ఈ సినిమాలో కంగనా రనౌత్ ఒక కీలక పాత్రలో కనిపించబోతోంది. కంగనా రణౌత్ కు సంబంధించిన షూటింగ్ భాగాన్ని ఇప్పటికే ఈ మూవీ బృందం పూర్తి చేసింది. ఇది ఇలా ఉంటే ఈ సినిమాకు ఎం ఎం కీరవాణి సంగీతం అందిస్తున్నాడు. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ మేకర్స్ ఈ సినిమాకు సంబంధించిన ఒక అదిరిపోయే సూపర్ సాలిడ్ అప్డేట్ ను తాజాగా ప్రకటించింది. తాజాగా ఈ మూవీ మేకర్స్ ఈ సినిమా విడుదల కు సంబంధించిన అప్డేట్ ను ప్రకటించింది.
ఈ మూవీ ని ఈ సంవత్సరం వినాయక చవితి సందర్భంగా విడుదల చేయనున్నట్లు ఈ మూవీ మేకర్స్ తాజాగా అధికారికంగా ప్రకటించారు. అలాగే ఈ సినిమాను తమిళ్ తో పాటు తెలుగు , కన్నడ , మలయాళం , హిందీ భాషల్లో విడుదల చేయనున్నట్లు ఈ మూవీ బృందం అధికారికంగా ప్రకటించింది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ ని లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ పై సుభాస్కరన్ నిర్మిస్తున్నాడు.