హీరోయిన్ గా అవ్వకుండా పోవడానికి కారణం వారే :: నటి రాగిణి

murali krishna
ఎన్నో సినిమాలు, సీరియల్స్ లో నటించి అద్భుతమైన నటిగా మంచి పేరు దక్కించుకున్న ప్రముఖ నటి రాగిణి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.ఇటీవల బ్రహ్మముడి సీరియల్ లో కనకం అక్క మీనాక్షి క్యారెక్టర్ తో మళ్లీ బుల్లితెర ప్రేక్షకులను అలరించిన ఈమె జీవిత విశేషాల గురించి ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పంచుకుంది. ఇప్పటివరకు 550 కి పైగా సీరియల్స్, 190 కి పైగా సినిమాలలో నటించిన రాగిణి తన కెరియర్ విషయాలు, ఎత్తు పళ్ళాలు, కన్నీటి సంఘటనల గురించి ఒక్కొక్కటిగా వెల్లడించింది.ఆమె మాట్లాడుతూ.. సీనియర్ యాక్టర్ అయినా సరే ఇప్పటివరకు నాకు ఇంత పారితోషకం కావాలని ఎప్పుడూ నేను డిమాండ్ చేయలేదు. ఎంత ఇస్తే అంత తీసుకున్నాను.. రూ.300 ఇస్తానన్నా సరే షూటింగ్ కి వెళ్ళేదాన్ని.. కొన్నిసార్లు రాత్రి షూటింగ్ నుంచి వచ్చాక తినడానికి కూడా ఏమీ లేక కేవలం మంచినీళ్లు మాత్రమే తాగి పడుకున్న రోజులు కూడా చాలా ఉన్నాయి. ఇక మా అమ్మానాన్నలకు నేను 12వ సంతానాన్ని మేము మొత్తం 13 మంది. అప్పట్లో ఆర్థిక పరిస్థితులు ఎక్కువగా ఉండటం వల్ల నాకు చదువుకునే అదృష్టం లభించలేదు. అమ్మానాన్నలను నేనే చూసుకున్నాను ఇక షూటింగ్ కు వెళ్లి వచ్చి వాళ్లకు సేవ చేసేదాన్ని.
ఇక కుటుంబంలో 12వ దాన్ని కావడంతో నాకంటే ముందు ఉన్న అక్కల పిల్లలతోనే నేను కలిసి పెరిగాను. కానీ ఒక అక్క చనిపోవడం వల్ల వాళ్ళ పిల్లలను కూడా నేనే పెంచాల్సి వచ్చింది. ఇక నేను చదువుకోకపోయినా వాళ్లను బాగా కష్టపడి చదివించాను. ఇక అక్క పిల్లలు ముగ్గురు కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా సెటిల్ అయ్యారు. వారి ముగ్గురికి కూడా పెళ్లిళ్లు చేశాను. ఆ బాధ్యతలలో పడి నాకు పెళ్లి ఆలోచన రాలేదు.అందుకే పెళ్లి చేసుకోలేదు. హీరోయిన్ అయ్యే అన్ని లక్షణాలు, టాలెంట్ నాకు ఉందని అంతా అనుకునేవారు కానీ పిల్లల బాధ్యతల వల్ల చెప్పే వాళ్ళు లేక ఇలా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సీరియల్స్ తోనే సరిపెట్టుకున్నాను అంటూ తెలిపింది రాగిణి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: