వేణుమాధవ్ డైరెక్షన్స్ లో సినిమా ఆగిపోవడానికి కారణం అదేనా....!!
ఇది ఇలా ఉండగా వేణు మాధవ్ మల్టీ టాలెంటెడ్ ఆర్టిస్టు అనే సంగతి మన అందరికీ తెలిసిందే. కేవలం నటన మీదనే కాకుండా దర్శకత్వం మీద కూడా మంచి గ్రిప్ ఉంది. ఒకానొక దశలో ఆయన సన్నివేశాలకు ఆయనే దర్శకత్వం వహించుకునేవాడట. ఉదాహరణకి రాజమౌళి తెరకెక్కించిన 'సై' మూవీ లో వేణు మాధవ్ ట్రాక్ మొత్తం, స్వయంగా ఆయనే డిజైన్ చేయించుకొని, ఆయన అభిరుచికి తగ్గట్టుగా దర్శకత్వం వహించేవాడట. అలాగే ఛత్రపతి సినిమాలో కూడా ఇంతే, తన ట్రాక్ మొత్తానికి తానే దర్శకత్వం వహించాడు. ఇక ఆ తర్వాత విక్టరీ వెంకటేష్ హీరో గా నటించిన సంక్రాంతి సినిమాలో కూడా ఇదే రిపీట్ అయ్యింది. ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. అయితే గతం లో వేణు మాధవ్ అప్పుడే వరుస హిట్స్ తో మంచి ఊపు మీదున్న ఒక హీరో ని పెట్టి , తానే నిర్మాతగా మారి ఒక సినిమా తియ్యాలనుకున్నాడట. ఆ హీరో మరెవరో కాదు, సునీల్. కమెడియన్ ఒక రేంజ్ లో సక్సెస్ అయినా సునీల్ హీరో గా కూడా అదే రేంజ్ లో సక్సెస్ సాధించిన సంగతి అందరికీ తెలిసిందే. అప్పట్లో ఆయన హీరో గా నటించిన 'అందాల రాముడు' అనే చిత్రం ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయ్యిందో మన అందరికీ తెలిసిందే. ఈ సినిమా తర్వాత కూడా సునీల్ కమెడియన్ గా కొనసాగాడు కానీ , అడపాదడపా హీరో గా కూడా నటిస్తూ ఉండేవాడు. అలా వేణు మాధవ్ దర్శకత్వం, సునీల్ హీరో గా అప్పట్లో ఒక ప్రాజెక్ట్ లాక్ అయ్యింది. సునీల్ వేణు మాధవ్ మీద అభిమానంతో ఆయన ఎన్ని డేట్స్ అడిగితె అన్ని డేట్స్ సర్దుబాటు చేసి ఇచ్చాడు. కానీ స్క్రిప్ట్ డెవలప్మెంట్ విషయం లో చాలా ఆటుపోట్లు ఎదురయ్యాయి, అలాగే వేణు మాధవ్ కి ఫైనాన్స్ చేసే వాళ్ళు కూడా చివరి నిమిషం లో చేతులు దులుపుకున్నారు, అలా గ్రాండ్ గా ప్రారంభమైన ఈ సినిమా మధ్యలోనే ఆగిపోయింది, సునీల్ డేట్స్ కూడా వేస్ట్ అయిపోయాయి.