విజయ్ ఆంటోనీ "హత్య" మూవీ విడుదల తేదీ వచ్చేసింది..!

Pulgam Srinivas
బిచ్చగాడు మూవీ ద్వారా అద్భుతమైన గుర్తింపును సంపాదించుకున్న విజయ్ ఆంటోనీ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. బిచ్చగాడు మూవీ తో టాలీవుడ్ ఇండస్ట్రీ లో సూపర్ క్రేజ్ ను సంపాదించుకున్న ఈ నటుడు ఆ తర్వాత తాను నటించిన అనేక సినిమా లను తెలుగు లో కూడా విడుదల చేశాడు. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ నటుడు బిచ్చగాడు 2 అనే మూవీ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ మూవీ లో విజయ్ హీరోగా నటించడం మాత్రమే కాకుండా ... ఈ సినిమాకు దర్శకత్వం కూడా వహించాడు. ఈ మూవీ మంచి అంచనాల నడుమ రెండు తెలుగు రాష్ట్రాల్లో విడుదల అయింది.
 


ఆ అంచనాలకు తగినట్టు గానే ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో పర్వాలేదు అని రేంజ్ విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకుంది. ఇలా బిచ్చగాడు 2 మూవీ తో మంచి విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకున్న విజయ్ ఆంటోని ప్రస్తుతం హత్య అనే సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఈ మూవీ కి బాలాజీ కుమార్ దర్శకత్వం వహిస్తూ ఉండగా ... మోస్ట్ బ్యూటిఫుల్ నటీ మణులు అయినటువంటి మీరాక్షి చౌదరి ... రితికా సింగ్ లు ఈ సినిమాలో కీలక పాత్రలలో కనిపించబోతున్నారు. ఇది.ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ బృందం ఈ సినిమాకు సంబంధించిన ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ ను అధికారికంగా ప్రకటించింది.


తాజాగా ఈ మూవీ యూనిట్ ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించింది. ఈ మూవీ ని ఈ సంవత్సరం జూలై 21 వ తేదీన థియేటర్ లలో విడుదల చేయనున్నట్లు ఈ మూవీ బృందం తాజాగా అధికారికంగా ప్రకటిస్తూ ఒక పోస్టర్ ను కూడా విడుదల చేసింది. ఈ మూవీ బృందం తాజాగా ఈ మూవీ విడుదల తేదీని ప్రకటిస్తూ విడుదల చేసిన పోస్టర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: