ఓ వైపు రాజకీయాలు ఇంకా మరో వైపు సినిమాలు ఇలా రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ బాగా బిజీగా గడిపేస్తున్నాడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ప్రస్తుతం ఇండస్ట్రీలో ఏ హీరో లేనంత బిజీగా బ్యాక్ టు బ్యాక్ షూటింగ్లలో పాల్గొంటూ చేతిలో ఉన్న ప్రాజెక్ట్‌లను ఫినీష్ చేసే దిశగా చక చకా పనులు చేస్తున్నాడు. ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లైనప్‌లో ముందుగా రానుంది బ్రో మూవీ. ఆయన మేనల్లుడు ప్రముఖ టాలీవుడ్ యంగ్ హీరో సాయిధరమ్ తేజ్‌తో కలిసి నటిస్తున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు సినిమాపై ఓ రేంజ్లో హైప్ తెచ్చిపెట్టాయి. ఇక ఈ సినిమా టీజర్‌ను కూడా గురవారం నాడు రిలీజ్ చేస్తున్నట్లు సమాచారం తెలుస్తుంది.ఇదిలా ఉంటే తాజాగా పవన్ కళ్యాణ్ టీజర్‌కు సంబంధించిన డబ్బింగ్ పూర్తి చేసినట్లు చిత్రబృందం వెల్లడించింది. ఈ మేరకు సముద్రఖనితో ఉన్న ఫోటోలను పోస్ట్ చేసింది మూవీ యూనిట్. కాగా ప్రస్తుతం పవన్ కళ్యాణ్ భీమవరంలో ఉన్నాడు. దాంతో బ్రో యూనిట్ స్వయంగా భీమవరంకు వచ్చి పవన్ కళ్యాణ్ తో డబ్బింగ్ కంప్లీట్ చేసుకుంది.
ఇక టీజర్‌కు సంబంధించిన అప్డేట్ ఈ రోజు సాయంత్రంలోపు వచ్చే అవకాశం ఉంది. పీపుల్ మీడియా బ్యానర్‌పై తెరకెక్కుతున్న ఈ సినిమా మరో నెల రోజుల్లో విడుదల అయ్యి ప్రేక్షకుల ముందుకు రానుంది.ఇక తమిళంలో సూపర్ హిట్టయిన వినోదయ సిత్తం సినిమాకు రీమేక్‌గా ఈ సినిమా తెరకెక్కుతుంది. త్రివిక్రమ్ శ్రీనివాస్ తెలుగు నేటివిటీకి తగ్గట్లు పలు మార్పులు చేర్పులు చేస్తున్నాడు. ఒక యాక్సిడెంట్లో చనిపోయిన ఓ వ్యక్తి.. తాను చేయాల్సిన పనులు కొన్ని ఉన్నాయని ఇంకా దానికి మూడు నెలలు సమయం కావాలని తననీ పైకి తీసుకెళ్లడానికి వచ్చిన దేవుడిని అతను ఓ వరం అడుగుతాడు. అయితే దానికి దేవుడు ఒప్పుకోవడమే కాకుండా ఆ మూడు నెలలు ఇక్కడే ఉండి ఆ వ్యక్తితో కలిసి ప్రయాణిస్తాడు. ఇక ఆ తర్వాత ఏం జరిగింది? చనిపోయిన వ్యక్తి తాను అనుకున్న పనులను పూర్తి చేశాడా? అనే కథాంశంతో ఈ సినిమా సాగుతుంది.