ఎన్టీఆర్ మూవీ కోసం.. సముద్ర తీరాన్ని హైదరాబాద్ తెచ్చారట?

praveen
మొన్నటి వరకు టాలీవుడ్ లో మాత్రమే స్టార్ హీరోగా కొనసాగిన జూనియర్ ఎన్టీఆర్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కి ప్రేక్షకులు ముందుకు వచ్చిన త్రిబుల్ ఆర్ సినిమా తర్వాత పాన్ ఇండియా స్టార్ గా మారిపోయాడు అన్న విషయం తెలిసిందే. అదే సమయంలో ఇక త్రిబుల్ ఆర్ సినిమాలోని ఓ పాటకు అటు ఆస్కార్ అవార్డు రావడంతో ఇక ఎన్టీఆర్ గ్లోబల్ స్టార్ గా మారిపోయాడు.  ప్రస్తుతం ఎన్టీఆర్ చేస్తున్న సినిమాలపై ప్రపంచవ్యాప్తంగా ఉన్న  అభిమానులు అందరూ కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

 ఇక ప్రస్తుతం వరుస సినిమాలతో ఎన్టీఆర్ బిజీగా ఉన్నాడు అని చెప్పాలి. కాగా ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో దొరికేకుతున్న దేవర అనే సినిమాలో నటిస్తూ ఉన్నాడు. ఇక ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ అటు ప్రేక్షకులందరికీ కూడా తెగ ఆకట్టుకుంది. అయితే ఇక భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాను అటు తెలుగుతోపాటు వివిధ భాషల్లో కూడా విడుదల చేయాలని మేకర్స్ నిర్ణయించుకున్నారు అన్న విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు ఎన్టీఆర్ కొరటాల మూవీకి సంబంధించి ఒక క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది.

 ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న దేవర సినిమా కోసం ఏకంగా హైదరాబాద్ కి సముద్ర తీరాన్ని తీసుకువచ్చారట మేకర్స్. హైదరాబాద్ కి సముద్ర తీరాన్ని తీసుకురావడం ఏంటి వినడానికి విచిత్రంగా ఉంది అనుకుంటున్నారు కదా. హైదరాబాదులోనే భారీ ఖర్చుతో సముద్ర తీరాన్ని షిప్ యార్డ్ సెట్ ను ఏర్పాటు చేయబోతున్నారట సాబు సీరియల్ ప్రొడక్షన్ డిజైనర్. ఇక ఈ సెట్ ను అద్భుతంగా తీర్చిదిద్దారట. ఇక్కడే హీరో జూనియర్ ఎన్టీఆర్ ఇంట్రడక్షన్ సీన్ తో పాటు పోరాట సన్నివేశాలను చిత్రీకరించారట. ఇక ఇది సినిమాకి హైలైట్ గా నిలుస్తాయని చిత్ర యూనిట్ చెబుతోంది. కదా ఈ సినిమా కోసం అభిమానులందరూ కూడా ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: