ప్రస్తుత కాలంలో ఎస్‌యూవీ కార్లకు డిమాండ్ మాములుగా లేదు. ఆ కార్లకి ప్రేక్షక ఆదరణ విపరీతంగా పెరిగింది. కంఫర్ట్ కోసం జనాలు లక్షలు పెట్టి కార్లు కొంటున్నారు. ఖర్చు కంటే సౌకర్యానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు.అలాగే కంపెనీలు కూడా ఎస్‌యూవీల్లో ఎప్పటికప్పుడు అప్‌డేటెడ్ ఫీచర్లని అందిస్తున్నాయి. కియా మోటార్స్ కంపెనీ ఎస్‌యూవీ అయితే ఇప్పుడు మార్కెట్‌లో మంచి ఆసక్తి రేపుతోంది. కొరియా దేశానికి చెందిన ప్రముఖ కార్ల కంపెనీ కియా మోటార్స్ ఏపీలో యూనిట్ ని స్థాపించి చాలా కాలమైంది. అప్పట్నించి దేశంలోని రోడ్లపై కియా కార్లు ఒక రేంజ్ లో సందడి చేస్తున్నాయి. ఫీచర్ల పరంగా కియా కార్లను కొట్టేవే లేవనే చెప్పాలి. ఇప్పుడు రెండు ఎస్‌యూవీలను అప్‌డేట్ చేసి ఇండియన్ మార్కెట్‌లో లాంచ్ చేసేందుకు రెడీ అయింది కియా కంపెనీ. ఈ రెండు ఎస్‌యూవీల్లో ఒకటి జూలై నెలలో లాంచ్ కానుంది. ఎస్‌యూవీ మార్కెట్‌లో అగ్ర స్థానంలో ఉన్న హ్యుండయ్ క్రెటాతో పోటీ పడనుంది. ఇక రెండవ ఎస్‌యూవీ మారుతి బ్రెజాతో కూడా పోటీ పడుతుంది.ఇక కియా మోటార్స్ కంపెనీ ఇప్పుడు కియో సెల్టోస్ ఫేస్‌లిఫ్ట్ మోడల్ ని ప్రవేశపెట్టనుంది. కియా సెల్టోస్ కొత్త ఫేస్‌లిఫ్ట్‌లో టైగర్ నోస్ గ్రిల్ ఇంకా కొత్త ఎల్ఈడీ డీఆర్ఎల్ ఉంటాయి.
అలాగే కొత్త కియా సెల్టోస్ ఇంటీరియర్ అంతా కొత్తగా ఉంటుంది. ఇందులో ఇన్‌ఫోటైన్‌మెంట్ స్క్రీన్ , ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్ కోసం కనెక్టెడ్ యూనిట్ కూడా ఉంటుంది. అలాగే డ్యాష్‌బోర్డ్ లేఅవుట్ కూడా కొత్తదే. ఇందులో అడ్వాన్స్డ్ డ్రైవర్ అసిస్టెంట్ సిస్టమ్ కూడా ఉంటుంది. ఇంకా దీంతోపాటు కొత్త 1.5 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్ ఆప్షన్ కూడా ఉంటుంది. కియా క్యారెన్స్ ఎంపీవీలో వాడే టర్బో పెట్రోల్ ఇంజన్ ఉంటుంది. ఈ కార్ హ్యుండయ్ క్రెటాతో పోటీ పడనుంది.కియా సోనెట్ ఫేస్‌లిఫ్ట్ కూడా లాంచ్ అవుతుంది.కియా మోటార్స్ ఇప్పుడు సబ్ 4 మీటర్ కాంపాక్ట్ ఎస్‌యూవీ సోనెట్ ఫేస్‌లిఫ్ట్ మోడల్ కోసం పనిచేస్తుంది. ఇప్పటికే ఈ కారు టెస్చింగ్ ఇండియాలో కంప్లీట్ అయ్యింది. అలాగే అప్‌డేటెడ్ మోడల్ డిజైన్‌లో కూడా మార్పు ఉంటుంది. ఇంకా ఇంటీరియర్ పూర్తిగా మారుతుంది.అలాగే దాంతోపాటు కొత్త ఫీచర్లని కూడా జోడించారు. ముఖ్యంగా కొత్త సెల్టోస్‌లో ఉన్నట్టు విభిన్నంగా కూడా ఉంటుంది.అలాగే ఇందులో ఇప్పుడున్న ఇంజన్ ఆప్షన్లే కొనసాగనున్నాయి.1.2 లీటర్ ఎన్ఏ పెట్రోల్, 1.0 లీటర్ టర్బో పెట్రోల్ ఇంకా 1.5 లీటర్ టర్బో డీజిల్ ఉన్నాయి. కియా సెల్టోస్ ఫేస్‌లిఫ్ట్ జూలై నెలలో లాంచ్ కానుండగా, కియా సోనెట్ ఫేస్‌లిఫ్ట్ లాంచ్ ఎప్పుడనేది ఇంకా క్లారిటీ .ఈ కారు మారుతి బ్రెజాతో పోటీ పడనుంది.