మొత్తానికి గుడ్ న్యూస్ చెప్పిన కీర్తి సురేష్..!!
ఆ తర్వాత తమిళ సినిమాలలో కూడా నటించింది. 2016లో నేను శైలజ అనే సినిమా ద్వారా తెలుగుతరకు పరిచయమయ్యింది.ఈమె నటించిన మహానటి సినిమాతో ఏకంగా సావిత్రి పాత్రని మెప్పించేలా చేసింది. ఆ తర్వాత వరుస ఆఫర్లు వెల్లుపడ్డాయి. పైగా అభిమానులను కూడా సంపాదించుకోవడంతో మహానటి అనే ట్యాగ్ను కూడా సంపాదించుకుంది. ఈ సినిమా తర్వాత అన్ని అలాంటి పాత్రలే రావడంతో ఈ అమ్మడు ఓన్లీ పాత్రలకే సెట్ అవుతుందని పలువురు నెటిజన్లు కామెంట్లు చేశారు. అయితే ఆ తర్వాత మహేష్ నటించిన సర్కారు వారి పాట చిత్రంలో గ్లామర్ లుక్లో కనిపించి అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది.
ఇటీవల దసరా సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాగా ఈ సినిమా కూడా మంచి సక్సెస్ను అందుకుంది. ఈ సినిమా తర్వాత కీర్తి సురేష్ మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. గతంలో గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సినిమాలలోని నటిస్తోంది. కొత్త సినిమాలు చేయకపోవడానికి కారణం తను ఎక్స్పోజింగ్ వల్లే అన్నట్లుగా వార్తలు వినిపించాయి. దీంతో తెలుగు హీరోలు ఈమెను దూరం పెడుతున్నారని వార్తలు వినిపిస్తున్న తరుణంలో ఇందులో నిజం లేదని తెలుస్తోంది. తాజాగా చందు మొండేటి దర్శకత్వంలో నాగచైతన్యతో ఒక సినిమాలో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది ఈ సినిమాని G-2 బ్యానర్ పై తెరకెక్కిస్తున్నట్లు సమాచారం.