కాంతారా 2 కు సర్వం సిద్ధం.. ఎప్పటినుండో తెలుసా..!?

Anilkumar
కన్నడ నాట నుండి చాలా సైలెంట్ గా వచ్చి సైన్సేషన్ క్రియేట్ చేసిన సినిమాలు చాలానే ఉన్నాయి. ఇక కాంతారా సినిమా పాన్ ఇండియా రేంజ్ లో ఎలాంటి సత్తా  చాటిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ముఖ్యంగా గత ఏడాది విడుదల దేశవ్యాప్తంగా సంచలనాన్ని సృష్టించిన కాంతారా సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. దక్షిణ కన్నడ సంస్కృతిలో భాగమైన భూతకోల నేపథ్యాన్ని కధగా తీసుకొని ఈ సినిమాని తెరకెక్కించిన ఈ సినిమా  ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో మనందరికీ తెలిసిందే. డివోషనల్ యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందిన ఈ సినిమా రిలీజ్ అయిన అన్ని భాషల్లో ఊహించిన విధంగా రెస్పాన్స్ ని అందుకుంది. 


దాంతోపాటు అదిరిపోయే కలెక్షన్స్ సైతం రాబెట్టింది ఈ సినిమా. దాదాపుగా 400 కోట్లకు పైగా నీ కలెక్షన్స్ సాధించిన సినిమాగా నిలిచింది కాంతారా .అయితే ఇటీవల ఈ సినిమాకు సెకండ్ పార్ట్ సైతం తెరకెక్కించడానికి రెడీ అయ్యారు హీరో డైరెక్టర్ రిషబ్. సినిమాకు రెండవ భాగాన్ని తలకెక్కించడానికి రెడీగా ఉన్నారు. అయితే ఈ సినిమాకి ముందు జరిగిన భాగాన్ని ఫ్రీక్వల్ లో చూపించబోతున్నారట మేకర్స్.ఈ క్రమంలోని ఈ సినిమాకి సంబంధించిన అన్ని షూటింగ్ ఏర్పాట్లు పూర్తయినట్లుగా తెలుస్తోంది. కాగా ఈ సినిమా షూటింగ్ ఆగస్టు 27 నుండి ప్రారంభించనున్నట్లుగా వార్తలు వినబడుతున్నాయి.


అయితే కాంతారా ఫ్రీక్వల్ సినిమా చాలా ప్రత్యేకంగా ఉండబోతుందని తెలుస్తోంది. అయితే ఈ భాగం సినిమాపై ప్రత్యేక శ్రద్ధ పెట్టనున్నారట చిత్ర బృందం .ముఖ్యంగా ఈ సినిమా హీరో మరియు దర్శకుడు ఆయన రిషబ్ శెట్టి ఈ సినిమాలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలని నిర్ణయించుకున్నారట. కాగా ఈ సినిమాని ఒకేసారి పాన్ ఇండియా లెవెల్లో విడుదల చేయనున్నట్లుగా తెలుస్తోంది .బడ్జెట్ కూడా భారీగానే పెట్టనున్నారట చిత్ర బృందం. కాగా ఈ సినిమా కోసం హీరో ప్రత్యేక శిక్షణలు కూడా తీసుకుంటున్నారట. గుర్రపు స్వారి తో పాటు కొన్ని ప్రాచీన విద్యల్లో శిక్షణ పొందుతున్నారట రిషబ్ శెట్టి ..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: