చిరంజీవికి, దళపతి విజయ్ కి.. మధ్య ఉన్న సంబంధం గురించి తెలుసా?

praveen
తెలుగు చిత్ర పరిశ్రమలో మెగాస్టార్ చిరంజీవికి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఎంతో మంది యంగ్ హీరోస్ వచ్చి స్టార్ హీరోలుగా ఎదిగినప్పటికీ అటు మెగాస్టార్ చరిష్మా మాత్రం ఇంకా తగ్గలేదు అని చెప్పాలి. అయితే ఇక మెగాస్టార్ ను స్ఫూర్తిగా తీసుకొని ఇండస్ట్రీలోకి వచ్చి స్టార్లుగా ఎదిగిన హీరోలు చాలామంది ఉన్నారు. ఇలా మెగాస్టార్ స్ఫూర్తితోనే ఇప్పుడు ఇండస్ట్రీలో రాణిస్తున్న వారిలో అటు కొలీవుడు స్టార్ హీరో ఇళయ దళపతి విజయ్ కూడా ఉన్నారు.

 తనకు మెగాస్టార్ చిరంజీవి స్ఫూర్తి అని ఆయనను చిన్నప్పటినుంచి ఆయనని చూస్తూ ఫైట్లు డాన్సులు నేర్చుకున్నానని విజయ్ ఎన్నో సార్లు చెప్పాడు. అయితే చిరంజీవి విజయ్ కి సంబంధించిన ఒక వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయింది. విజయ్ కు చిరంజీవికి మధ్య ఒక రిలేషన్షిప్ ఉందట. అది ఏంటో తెలుసుకుందాం.

 విజయ్ తండ్రి  చంద్రశేఖర్ తమిళంలో యాక్షన్ దర్శకుడిగా ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు. అయితే ఈయన రజనీకాంత్, విజయ్ కాంతులతో సూపర్ హిట్ సినిమాలను తెరకెక్కించాడు. అయితే ఆ హీరోలకు మంచి యాక్షన్ హీరోలుగా గుర్తింపు రావడంలో ఈయనదే కీలకపాత్ర అని చెప్పాలి. చంద్రశేఖర్ చిరంజీవితో కూడా పలు సినిమాలను తీశారు. చట్టానికి కళ్ళు లేవు, పల్లెటూరి మొనగాడు, దేవాంతకుడు లాంటి సూపర్ హిట్ సినిమాలను చిరంజీవితో తీసాడు. ఇలా తెలుగు తమిళం హిందీ భాషల్లో కూడా స్టార్ డైరెక్టర్ గా హవా నడిపించాడు.

 ఇక తమిళంలో విజయ్ యాక్షన్ హీరోగా నిలదొక్కుకోవడంలో కూడా తండ్రి  చంద్రశేఖర్ సినిమాలే కీలక పాత్ర పోషించాయి అని చెప్పాలి. అయితే చిరంజీవి కెరియర్ లో స్టార్ హీరోగా ఎదగడానికి విజయ్ తండ్రి చంద్రశేఖర్ కీలక పాత్ర పోషించారు అని చెప్పాలి. సినిమాల్లో చిరంజీవిని చూస్తూ పెరిగిన విజయ్ ఇక ఇప్పుడు తనదైన శైలిలో ఫైట్లు డాన్సులతో అదరగొడుతున్నాడు. ఇలా విజయ తండ్రి చిరంజీవి కెరియర్ను నిలబెట్టడంలో కీలక పాత్ర వహిస్తే.. ఇక విజయ్ చిరంజీవి స్ఫూర్తితో సినిమాల్లో రాణిస్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: