ఆకట్టుకునే సైకలాజికల్‌ హారర్ థ్రిల్లర్ ‘అశ్విన్స్’!

Chakravarthi Kalyan
థ్రిల్లర్స్‌ అంటే చాలు ప్రేక్షకుల నుంచి ఆదరణ బావుంటుంది. అందులోనూ హారర్‌ థ్రిల్లర్‌ అంటే ఇక ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆ కథలో ఉండే యాంగ్జైటీ, ఎగ్జైట్‌మెంట్‌ ఎప్పటికప్పుడు కొత్తగా ఉంటుంది. అందుకు కొంత మంది దర్శకులు ఇలాంటి కథనాలపైన ఫోకస్‌ ఎక్కువ పెడుతుంటారు. దాంతో చాలా మంది దర్శకులే సక్సెస్‌ అయ్యారనుకోండి. ఇక ఈ రకమైన చిత్రాలను ఓటీటీ ప్రేక్షకులను కూడా దృష్టిలో పెట్టుకుని తీయడంతో ఈ దర్శకులను విజయం వరిస్తుంది. మూడు భాషల్లో తెరకెక్కిన అశ్విన్స్‌ చిత్రం ఈ కోవకు చెందిందే. వసంత్‌ రవి మరో నలుగురు కలిసి నటించిన ఈ చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది.  ఇక రకరకాలుగా ఉండే చిత్ర ప్రమోషన్స్‌ దీనికి మాత్రం చాలా భిన్నంగా జరుగుతున్నాయి. ఈ సినిమా  కేవలం 18 సం.లకు పై బడిన వారు మాత్రమే చూడాలని చెప్పారు. అంటే ఇందులో చాలా హారర్ ఎలిమెంట్స్ ఉన్నాయని ప్రేక్షకులకు ముందే హింట్ ఇస్తున్నారన్నమాట. ఇకపోతే సెన్సార్‌ బోర్డ్‌ కూడా దానికి తగ్గట్టుగానే ఎ సర్టిఫికెట్‌ ఈ చిత్రానికి ఇవ్వడం జరిగింది. ఆ హారర్‌ ఎలిమెంట్స్‌ ఏమిటో తెలియాలంటే ఈ చిత్రం తప్పకుండా చూడాల్సిందే మరి.
చిత్ర కథాంశం.... ఓ రైతు దీనగాదగా చెప్పవచ్చు. ఊరిలో రైతుకి ఇద్దరు పిల్లలు ఇద్దరు అకస్మాత్తుగా చెరువులో ముగిని చనిపోతారు. ఆ రైతు... అశ్వినీదేవతల కోసం ఘోర తపస్సు చేసి... తన కుమారులను ఎలాగైనా బతికించాలని వేడుకుంటాడు. దాంతో అశ్వినీదేవతలు ప్రత్యక్షమై... ఓ కుమారుడిని మాత్రమే బతికించి... ఆ రైతుకి మాత్రం ప్రకృతి పరంగానే మీకు మరణం వస్తుందని మరే విధంగానూ ప్రాణహాని ఉండదని.. అదే విధంగా  ఓ రెండు బొమ్మలను ఎల్లవేళలతో తన కుమారుని వద్దనే ఉంచమని ఆ రైతుకు దేవతలు సూచిస్తారు. ఈ విషయాన్ని గమనించిన ఓ రాక్షస ఆత్మ ఆ రెండు బొమ్మలలో ఒకదాన్ని ఎలాగైన చేజిక్కించుకుని తన రాక్షస సంతతినంతా భూమి మీదకు తీసుకురావాలని కోరుకుంటాడు.
అనుకున్న విధంగానే ఆ రెండు బొమ్మలలో ఒక బొమ్మను... ఆ కుర్రాడి నుంచి పొందడానికి... నీ దగ్గర వున్న బొమ్మలలో ఒక బొమ్మను ఇస్తే... నీ సోదరుడిని బతికిస్తా... అంటూ నమ్మించి ఆ కుర్రాడి చేతిలో ఉన్న బొమ్మను తీసుకుంటుంది రాక్షస ఆత్మ. మరి ఈ విధంగా చేజిక్కించుకున్న బొమ్మతో ఆ రాక్షస ఆత్మ వాళ్ళను ఎలాంటి తిప్పలు పెట్టింది. ఎంత క్షోభకు గురిచేసిందనేది మిగతా కథ.

మరి ఈ కథ ద్వారా దర్శకుడు ప్రేక్షకులకు మంచి సందేశాన్ని కూడా అందజేశాడు.  ప్రతి మనిషిలోనూ రెండు పర్శ్వాలుంటాయి. అందులో మంచి ఒకటి కాగా మరొకటి చెడు. ఈ రెండింటినీ నియంత్రించే బలం మానవుడిదే అని తేల్చి చెప్పేశారు. మంచి పనులు చేయాలని మనిషి అనుకుంటే మనసు ఆత్రం ఎంతసేపు చెడు వైపు లాగుతుంటుంది. కాని ఎంతో నిగ్రహంతో వ్యవహరించాలన్న భావనతో దర్శకుడు చెప్పాడు. హీరోగా వసంత్ రవి రెండు పాత్రలు పోషించారు.  ఫస్ట్ హాఫ్ అంతా రొటీన్ హారర్ చిత్రాల్లోలాగే... ఓ పెద్ద భవంతిలోకి ఓ ఐదుగురు యువకులను తీసుకెళ్ళి... అక్కడ చిత్ర విచిత్ర సౌండ్లతో ఆడియన్స్ ని హారర్ ఎత్తించడానికి చేసిన ప్రయత్నాలు బాగానే సక్సెస్ అయ్యాయని చెప్పవచ్చు.  సెకెండాఫ్ లో ఆర్కియాలజిస్ట్ గా నటించిన ... విమలా రామన్ చాప్టర్ తో అసలు సినిమా స్వభావం బయటపడుతుంది. ఫస్ట్ హాఫ్ లో భయపెట్టి... సెకెండాఫ్ లో అసలు కథేంటి ఏమి జరుగుతుంది అన్నది తెలుస్తుంది. ప్రేక్షకులు ఈ సైకలాజికల్ హారర్ థ్రిల్లర్ కి బాగా ఎంగేజ్ అవుతారు.
ఈ చిత్రంలో ప్రధాన పాత్ర పోషించిన అర్జున్  హీరో వసంత్ రవి... రెండు పాత్రలలోనూ వేరు..వేరుగా  చూపించి... ఆకట్టుకున్నారు. హీరో తర్వాత విమలా రామన్ కు ఇంపార్టెన్స్ ఉంది.  సినిమాలోని మిగతా నాలుగు పాత్రలు కూడా వారి పరిమితికి తగ్గట్టుగానే నటించారు.  
ఇక మ్యూజిక్‌ విషయానికి వస్తే విజయ్ సిద్ధార్థ్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్... ఆడియన్స్ ని  భయపెడుతుంది. అందుకే పెద్దవాళ్ళు, చిన్నపిల్లలు కాస్త జాగ్రత్తగా ఈ సినిమాని చూడాలని సూచించారు. ఎ.ఎం.ఎడ్విన్ సాకే సినిమాటోగ్రఫీ పర్వాలేదు. ఎడిటర్ వెంకట్రాజన్ సినిమాని మరికొంచం కుదించిన పెద్దగా నష్టం లేదనిపించింది. నిర్మాత బి.వి.ఎస్.రవి నిర్మాణ విలువలు రిచ్ గా ఉన్నాయి. ఎక్కడా రాజీ పడకుండా సినిమాకి ఎంత వరకు ఖర్చు అవసరమో అంత ఖర్చుపెట్టినట్టు  నిర్మించారు అనిపించింది.
రేటింగ్: 3

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: