స్పై సినిమా రన్ టైం లాక్..!!

Divya
ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ ఉండి సక్సెస్ కాలేకున్న హీరోలు, హీరోయిన్స్ తెలుగు సినీ ఇండస్ట్రీలో కూడా చాలామంది ఉన్నారు. కానీ ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకుండా చాలా కష్టపడి సినీ ఇండస్ట్రీలోకి వచ్చి మంచి సక్సెస్ అయ్యారు హీరో నిఖిల్ సిద్ధార్థ్.. అయితే నిఖిల్ ఇటీవల పాన్ ఇండియా లెవెల్లో తన సినిమాలను తెరకెక్కిస్తూ బాక్సాఫీస్ వద్ద భారీగానే కలెక్షన్లు రాబడుతున్నారు. తాజాగా నిఖిల్ నటించిన స్పై సినిమా ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రం కూడా పాన్ ఇండియా లెవెల్ లోనే విడుదల చేస్తున్నారు. ఈ సినిమా ట్రైలర్ నిన్నటి రోజున ప్రేక్షకుల ముందుకు రావడం జరిగింది.

ఈ సినిమా మొత్తం సుభాష్ చంద్రబోస్ మరణం వెనుక ఉన్న రహస్యాలను తెలియజేసే అంశంతో తెరకెక్కించినట్లు తెలుస్తోంది. తాజాగా ఈ సినిమా ట్రైలర్ ఈవెంట్ ను హైదరాబాదులో AAA సినిమాస్ లో నిర్వహించారు. హీరో హీరోయిన్ల తో పాటు ఈ సినిమా టీం కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నది. ఈ సినిమా ట్రైలర్ కూడా అదిరిపోయేలా ఉండడంతో కచ్చితంగా ఈ సినిమా కూడా సక్సెస్ అయ్యి నిఖిల్ కు హ్యాట్రిక్ విజయాన్ని అందిస్తుందని అభిమానులు భావిస్తున్నారు. హీరో రానా కూడా ఇందులో కనిపించడం తో ప్రేక్షకులు మరింత ఎక్సైటింగ్ గా ఎదురుచూస్తున్నారు.

ఇందులోని ప్రతి సన్నివేశం కూడా చాలా ఉత్కంఠ పరిచేయాల కనిపిస్తోంది. గతంలో ఎన్నో చిత్రాలకు అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసిన గ్యారీ బిహెచ్ దర్శకత్వం చేస్తున్నారు. ఇందులో నిఖిల్ సరసన ఐశ్వర్య మేన నటిస్తోంది ఈడి ఎంటర్టైన్మెంట్ పతాకంపై రాజశేఖరరెడ్డి ఈ సినిమాని నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించి రన్ టైం లాక్ అయినట్టుగా తెలుస్తోంది. కేవలం "రెండు గంటల రెండు నిమిషాల" నిడివితో ఈ సినిమా సమయం ఉండబోతున్నట్లు తెలుస్తోంది. మరి ఏ మేరకు అభిమానులను ఆకట్టుకునే విధంగా ఈ సినిమా ఉండబోతుందో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: