మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మరియు ఉపాసన దంపతులు జూన్ 20న తల్లిదండ్రులుగా ప్రమోట్ అయ్యారు. ఉపాసన పండంటి ఆడబిడ్డకి జన్మనిచ్చింది. 11 ఏళ్ల తర్వాత మెగా ఫ్యామిలీలో సంబరాలు నెలకొన్నాయి. ఈ క్రమంలోనే తాతయ్య చిరంజీవి మీడియా వేదికగా తన సంతోషాన్ని వ్యక్తపరిచాడు.ఈ మధ్యకాలంలో తమ కుటుంబంలో జరిగిన శుభలన్నీ ఉపాసన కూతురు వలనే అంటూ గొప్పగా చెప్పుకోవచాడు చిరంజీవి. గొప్ప ఘడియల్లో రామ్ చరణ్ బిడ్డ పుట్టిందని అంటున్నారు. మంగళవారం రోజు మా ఇష్ట దైవం హనుమాన్ ఆశీస్సులతో అమ్మాయి పుట్టిందంటూ తన సంతోషాన్ని వ్యక్తం చేశాడు చిరంజీవి.
ఈ క్రమంలోనే రామ్ చరణ్ కూతురు పెద్ద కోటీశ్వరులు అంటూ చర్చలు జరుగుతున్నాయి.
అయితే ఒక అంచనా ప్రకారం రామచరణ్ ఉపాసన దంపతుల ఆస్తి విలువ 2500 కోట్లు ఉంటుందని తెలుస్తోంది. ఇక అందులో అధిక భాగం ఉపాసన ఆస్తి ఉంటుందట. ఉపాసన ఆస్తి 1000కోట్లకు పైగానే ఉంటుందని అంటున్నారు .ఇక ఉపాసన దోమకొండ సంస్థానం వారసురాలు. అపోలో చైర్మన్ సి ప్రతాపరెడ్డి మనవరాలు. ఇక ఆయన దేశంలోనే అత్యంత గొప్ప ధనవంతుల్లో ఒకరు. ఆయన ఆస్తి సుమారు 21 వేల కోట్లు. అంతేకాదు అపోలో గ్రూప్ మార్కెట్ వాల్యూ 70 కోట్లు ఉంటుందని తెలుస్తోంది.
ఇక చిరంజీవి ద్వారా రామ్ చరణ్ కి వచ్చిన ఆస్తి ఆయన సంపాదించినది పక్కన పెడితే ఉపాసన ద్వారా సంక్రమించే ఆస్తి వేల కోట్లు ఉంటుందని తెలుస్తోంది. ఇక అన్ని వేల కోట్లు ఉన్నాయి కాబట్టి రామ్ చరణ్ ప్రత్యేక విమానం సైతం కలిగి ఉన్నాడు .ఆయన కి కోట్ల విలువచేసే లగ్జరీ కార్లు సైతం ఆయన దగ్గర ఉన్నాయి. ఈ క్రమంలోనే రామ్ చరణ్ కూతురు జాతకం చూసిన జ్యోతిష్యులు సైతం ఆమె చాలా మహర్ జాతకురాలు అంటూ చెబుతున్నారు. ప్రస్తుతం ఉపాసన అపోలో వైస్ చైర్ పర్సన్ గా ఉన్నారు. ఇక రాంచరణ్ గ్లోబల్ స్టార్ గా కొనసాగుతున్నాడు..!!