నిఖిల్ తీరుపై విమర్శలు !
ఈసినిమాకు సంబంధించి విడుదలైన టీజర్ కు మంచి స్పందన రావడంతో ఈమూవీ బిజినెస్ కూడ బాగా జరిగింది అన్న వార్తలు వస్తున్నాయి. అయితే ఈసినిమా అనుకున్న విధంగా ఏఎనీల 29న విడుదల అవ్వడం నిఖిల్ కు ఇష్టం లేదు అన్నప్రచారం జరుగుతోంది. ఈ మూవీ విడుదలకు చాలా తక్కువ సమయం ఉండటంతో ఈమూవీని జూలై లో విడుదలచేయాలి అన్న నిఖిల్ సూచనకు ఈమూవీ నిర్మాత నుండి సానుకూలమైన స్పందన రాకపోవడంతో నితిన్ అసహనంలో ఉన్నాడు అంటూ గాసిప్పులు వస్తున్నాయి.
దీనికి తగ్గట్టుగానే ఈసినిమాకు సంబంధించిన ఫస్ట్ సాంగ్ విడుదల సమయంలోనూ అలాగే ఈసినిమా రిలీజ్ పోష్టర్ విడుదల సమయంలోనూ నిఖిల్ కనిపించక పోవడంతో అతడు సహాయ నిరాకరణ చేస్తున్నాడు అంటూ వస్తున్న గాసిప్పులకు మరింత బలం చేకూరింది. దీనితో ఒక సినిమా రిలీజ్ డేట్ ను తనకు కలిసి వచ్చే విధంగా నిర్మాత ఫిక్స్ చేసుకోవడానికి అతడికి స్వేచ్చ లేదా అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు.
వాస్తవానికి ‘ఆదిపురుష్’ మ్యానియా విపరీతంగా ఉంటుంది అనే భావనతో నిఖిల్ తన ‘స్పై’ సినిమాను ఈ నెలాఖరుకు విడుదల వద్దు అన్నాడు అన్న ప్రచారం ఉంది. అయితే ‘ఆదిపురుష్’ ఫెయిల్ అయినతరువాత కూడ నిఖిల్ తన సినిమా విడుదల విషయంలో ఎందుకు వెనకడుగు వేస్తున్నాడు అంటూ మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. గతంలో నిఖిల్ తాను నటించిన సినిమాల విషయంలో కొందరు నిర్మాతలతో ఇలాగే విభేదాలు వచ్చాయి కాబట్టి నిఖిల్ తీరు మారలేదా అంటూ మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు..