షాక్:వాటికి గుడ్ బై చెప్పిన చిన్నారి పెళ్ళికూతురు..!!

Divya
సినీ ఇండస్ట్రీలో నటీనటులుగా రాణించాలి అంటే చాలా కష్టపడాలని చెప్పవచ్చు.. సినీ ఇండస్ట్రీలో ఏదైనా రిస్కు ఉందంటే అది కచ్చితంగా నిర్మాతగా మారడమే అని చెప్పవచ్చు అలా సినీ ఇండస్ట్రీలో నటీనటులు సైతం సినీ రంగంలో నిర్మాతలుగా మారి సక్సెస్ అయిన వారు చాలా తక్కువ మందే ఉన్నారు. కానీ కొంతమంది నటీనటులు ఉన్నదంతా నిర్మాణ రంగంలో పెట్టుబడులు పెట్టి రోడ్డున పడ్డ పరిస్థితులు కూడా ఏర్పడ్డాయి. ఇంకా చెప్పాలి అంటే మహిళా నిర్మాతగా వ్యవహరించడం చాలా కష్టము. అన్నిటిలోనూ కూడా పట్టు ఉండాలి లేకపోతే మొదటికే మోసం వస్తుందని చెప్పవచ్చు.

అలనాటి హీరోయిన్లలో సావిత్రి సిల్క్ స్మిత జయసుధ విజయశాంతి వంటి వారు కూడా నిర్మాతలుగా మారి చాలా నష్టాలను చవిచూశారు. ఈ కోవాలనే కుర్ర  హీరోయిన్ ఆవికా గోర్ కూడా నిర్మాతగా మారింది.. ఉయ్యాల జంపాల చిత్రంతో మంచి పాపులారిటీ సంపాదించిన ఈమె మొదట చిన్నారి పెళ్లికూతురు సీరియల్ ద్వారా మంచి పాపులారిటీ సంపాదించుకుంది. ఈ క్రేజ్ తోనే ఈమె పలు చిత్రాలలో నటించి మంచి పాపులారిటీ సంపాదించుకున్నది.ఇక్కడ వరకు బాగానే ఉన్న ఈమె సొంతంగా సినిమా తీయాలనుకుంది దీంతో నిర్మాణ సంస్థను కూడా ప్రారంభించి సింగర్ సునీత కొడుకు ఆకాష్ హీరోగా ఆవికా గోర్ నిర్మాతగా ఒక సినిమా అని మొదలుపెట్టింది.
ఆ సినిమా పూర్తి అయిన విడుదలకు మాత్రం నోచుకోలేదు.. ఆ తర్వాత పాప్కార్న్ అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఈ సినిమా దారుణంగా లాప్ అయ్యింది చివరికి ఓటీటిలో కూడా ఈ సినిమా వేసుకోవడానికి ఏ ఓటీటి సంస్థ కూడా ముందుకు రాలేదు. ఇలా వరుసగా నిర్మాణ రంగంలో ఎదురుదెబ్బలు తగలడంతో ఈమె నిర్మాణ సంస్థను మానేసి పోయిన డబ్బును కేవలం యాక్టింగ్ ద్వారా మళ్ళీ తిరిగి సంపాదించుకొని ప్రయత్నం చేస్తోంది. ప్రస్తుతం ఆమె చేతిలో ఉమాపతి అనే సినిమాతో పాటు 1920 అనే ఒక హిందీ చిత్రంలో నటిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: