సల్మాన్ ఖాన్ వెంకటేష్ నటించిన చిత్రం ఓటీటిలొకి..!!

Divya
బాలీవుడ్లో స్టార్ హీరోగా పేరు పొందిన హీరో సల్మాన్ ఖాన్ నటించిన చిత్రం.. కిసి కా భాయ్ కీసి కి జాన్ ఈ సినిమా పలు భాషలలో పలు రకాల పేరుతో విడుదల కావడం జరిగింది. ఈ సినిమాని డైరెక్ట్ ఫర్హాద్ దర్శకత్వం వహించారు. సల్మాన్ ఖాన్ కు జోడిగా పూజా హెగ్డే ఇందులో నటించింది. వెంకటేష్ జోడిగా భూమిక నటించిన కీలకమైన పాత్రలో జగపతిబాబు నటించారు. భారీ అంచనాల మధ్య ఏప్రిల్ 21వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేక పోయింది. దీంతో పూజ హెగ్డే ఖాతాలో మరొక ఫ్లాప్ సినిమా పడిపోయింది.


కిసి కా భాయ్ కీసి కి జాన్ చిత్రం ఓటిటి హక్కులను జీ -5 పెద్ద మొత్తానికి దక్కించుకున్న తాజాగా ఈ సినిమా ఓటీటి విడుదల తేదీన కూడా ప్రకటించడం జరిగింది. ఈనెల 23వ తేదీన స్ట్రిమింగ్ కాబోతోంది. ఈ విషయాన్ని సల్మాన్ ఖాన్ సోషల్ మీడియా వేదికగా తెలియజేయడం జరిగింది.. కొన్ని సినిమాలు థియేటర్లలో పెద్దగా సక్సెస్ కాలేకపోయినా ఓటీటి లో మాత్రం సత్తా చాటుతూ ఉంటాయి.కిసి కా భాయ్ కీసి కి జాన్ చిత్రం కూడా ఓటీటి లో అభిమానులను ఏవిధంగా అలరిస్తుందో చూడాలి.


సల్మాన్ ఖాన్ ప్రస్తుతం టైగర్-3 సినిమాలో నటిస్తున్నారు టైగర్ సిరీస్ లో వస్తున్న మూడవ సినిమా ఇది కావడంతో ఈ సినిమా సక్సెస్ అవుతుందని అభిమానులు భావిస్తున్నారు. ఈ చిత్రంలో షారుక్ ఖాన్ అతిథి పాత్రలో కనిపించబోతున్నారు. హీరోయిన్గా కత్రినా కైఫ్ నటిస్తోంది.ఈ సినిమా షూటింగ్ పూర్తి అయినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమా ఈ ఏడాది దీపావళి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి చిత్ర బృందం సన్నహాలు చేస్తూనే ఉన్నారు. మరి ప్రేక్షకులను ఏ విధంగా ఆకట్టుకుంటాడో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: