ఆ విషయం లో స్టార్ హీరోలకి షాక్ ఇచ్చిన రాజమౌళి..!?

Anilkumar
ఆర్ఆర్ ఆర్ వంటి సినిమాతో ఆస్కార్ అవార్డును సొంతం చేసుకున్న దర్శక ధీరుడు రాజమౌళి తన తదుపరి సినిమాని సూపర్ స్టార్ మహేష్ బాబుతో చేయడానికి రెడీగా ఉన్నాడు. ఇక వీరి కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమాకి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇప్పటికే రావడం జరిగింది. ప్రస్తుతం ఆ సినిమాకి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఇక తాజాగా దర్శక ధీరుడు రాజమౌళి ఒక కమర్షియల్ యాడ్ లో నటించడం అందరికీ తెలిసిందే. ప్రముఖ మొబైల్ బ్రాండ్ కోసం రాజమౌళి బ్రాండ్ అంబాసిడర్ గా మారాడు .


అయితే తాజాగా ఈ బ్రాండ్ యొక్క ప్రమోషన్ యాడ్ లో నటించాడు రాజమౌళి. వాటికి సంబంధించిన ఒక వీడియో క్లిప్ కూడా బయటకు రావడంతో ఆ వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ వీడియోలో రాజమౌళి ఎంత స్టైలిష్ గా ఉన్నాడో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇక ఆ వీడియోలో రాజమౌళి స్టైలిష్ లోకి అందరినీ ఆకట్టుకుంటుంది. రాజమౌళి నటించిన ఫస్ట్ యాడ్ ఇదే. ఇక ఈ యాడ్లో నటించేందుకు గాను రాజమౌళి భారీ రెమ్యునరేషన్ కూడా తీసుకున్నారని అంటున్నారు. అయితే ఈ యాడ్లో నటించేందుకు గాను రాజమౌళి ఏకంగా మూడు కోట్ల విషయం తీసుకుంటున్నాడట .


సాధారణంగా ఏ యాడ్ షూట్ అయినా సరే రెండు మూడు రోజులు ఉంటుంది. దానికి రాజమౌళి మూడు కోట్లు తీసుకోవడంతో ఈ వార్త కాస్త ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ఇక ఈ వార్త విన్న సదరు నెటిజెన్స్ ఈ విషయంలో రాజమౌళి స్టార్ హీరోలనే మించిపోయాడు అంటూ రకరకాల కామెంట్స్ ని చేస్తున్నారు. దీంతో రాజమౌళికి సంబంధించిన ఈ వార్త ఇప్ఫడు హాట్ టాపిక్ గా మారింది. ఇలా ఉంటే ఇక రాజమౌళి ఈ ప్రస్తుతం వలస సినిమాలు డైరెక్ట్ చేస్తూ బిజీగా ఉన్న సంగతి మనందరికీ తెలిసిందే ..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: