OG: పవర్ఫుల్ పాత్రలో నటించనున్న విశాల్ వదిన?

Purushottham Vinay
తమిళ స్టార్ హీరో విశాల్‌ హీరోగా 2006 వ సంవత్సరంలో వచ్చిన 'పొగరు' సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ముఖ్యంగా ఈ సినిమాలో ప్రతి నాయకి క్యారెక్టర్‌లో దుమ్ము దులిపేశారు 'శ్రియ రెడ్డి'.ఆ పాత్రకు నూటికి నూరు శాతం ఆమె న్యాయం చేశారు. అయితే ఈ సినిమా తర్వాత ఆమె కేవలం రెండు సినిమాల్లో మాత్రమే నటించారు. సినిమాల్లో బాగా బిజీగా ఉన్న సమయంలోనే హీరో విశాల్‌ సోదరుడు విక్రమ్‌ కృష్ణా రెడ్డిని ఆమె పెళ్లి చేసుకున్నారు. పెళ్లి చేసుకున్న తర్వాత సినిమాలకు దూరం అయ్యారు. దాదాపు పదేళ్ల పాటు కేవలం కుటుంబానికి పరిమితం అయ్యారు. 2018 వ సంవత్సరంలో సెకండ్‌ ఇన్నింగ్స్‌ను మొదలుపెట్టారు. ''శిల సమయంగల్‌'' అనే తమిళ సినిమాతో ఆమె రీఎంట్రీ ఇచ్చారు.ప్రస్తుతం ఆమె కేవలం నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రలు చేస్తున్నారు. తెలుగులో కూడా మంచి మంచి ఆఫర్లు అందుకుంటున్నారు.ఇంకా టాప్‌ హీరోలతో సినిమాలు చేసే అవకాశం దక్కించుకుంటున్నారు.


 శ్రియ రెడ్డి ప్రస్తుతం ప్రభాస్‌ హీరోగా తెరకెక్కుతున్న 'సలార్‌' సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఆమె మరో భారీ సినిమాలో కూడా అవకాశాన్ని కొట్టేశారు. టాలీవుడ్ స్టార్ హీరో పవర్ స్టార్ పవన్‌ కల్యాణ్‌ హీరోగా తెరకెక్కుతున్న 'ఓజీ' సినిమాలో నటించే అవకాశాన్ని ఆమె దక్కించుకున్నారు. ఈ మేరకు ఆమె తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో ఓ పోస్టుని కూడా పెట్టారు.ఆ పోస్టు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో బాగా వైరల్‌గా మారింది. ఇక ఈ సినిమాలో కూడా శ్రీయా రోల్ చాలా పవర్ఫుల్ గా ఉంటుందని సమాచారం తెలుస్తుంది.ఇక శ్రియ రెడ్డి 2002లో విక్రమ్‌ హీరోగా వచ్చిన 'సమురాయ్‌' సినిమాతో సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టడం జరిగింది. అప్పుడప్పుడు తెలుగులోకి ఎంట్రీ ఇచ్చారు. ఆమె తెలుగు, తమిళం, మలయాళం, ఇంగ్లీష్‌ భాషల్లో పలు సినిమాలు చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

OG

సంబంధిత వార్తలు: