జనసేన అధినేత టాలీవుడ్ స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఒకపక్క సినిమాలతో.. ఇంకోపక్క రాజకీయాలతో బాగా బిజీగా గడుపుతున్న సంగతి తెల్సిందే. 2024 ఎన్నికలు దగ్గరపడుతుండడటంతో పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారంపై ఫుల్ గా ఫోకస్ పెట్టాడు. ఇక మరో రెండు రోజుల్లో ఆయన వారాహి యాత్ర కూడా ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలోనే జనసేన పార్టీ తరుపున ప్రచారానికి సర్వం సిద్ధం చేస్తున్నారు జనసేన కార్యకర్తలు. ఇక మరోపక్క కొత్తవారు జనసేన పార్టీ కండువా కప్పుకొని పవన్ కళ్యాణ్ కు తమ సపోర్ట్ ని తెలుపుతున్నారు. తాజాగా జనసేనలోకి అడుగుపెట్టాడు టాలీవుడ్ సీనియర్ స్టార్ ప్రొడ్యూసర్ BVSN ప్రసాద్.భోగవల్లి వెంకట సత్యనారాయణ ప్రసాద్.. 2003లో శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర పేరుతో సినిమా నిర్మాణ సంస్థను స్టార్ట్ చేసి ఎన్నో హిట్ చిత్రాలను నిర్మించాడు. ఇక పవన్ కళ్యాణ్ తో అత్తారింటికి దారేది, రామ్ చరణ్ తో మగధీర ఇండస్ట్రీ హిట్ సినిమాలను నిర్మించాడు.
ప్రస్తుతం మరో మెగా హీరో వరుణ్ తేజ్ తో గాండీవధారి అర్జున అనే సినిమాను నిర్మిస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే ఆయన రాజకీయ ఆసక్తితో జనసేన పార్టీలో చేరడం జరిగింది. కొద్దిసేపటి క్రితం జనసేన కార్యాలయంలో పవన్ కళ్యాణ్.. BVSN ప్రసాద్ కు జనసేన పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించాడు. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట తెగ వైరల్ గా మారాయి. వారాహి యాత్రలో పవన్ కళ్యాణ్ పక్కనే ఈయన కూడా ఉండనున్నట్లు సమాచారం తెలుస్తుంది. ఎప్పటినుంచో రాజకీయాల్లోకి అడుగుపెట్టాలని ప్రసాద్ ప్రయత్నాలు చేస్తున్నారని, పవన్ నిజాయితీ ఇంకా ఆయన మంచితనం చూసి వారి పార్టీలో అడుగుపెట్టినట్లు సమాచారం తెలుస్తోంది. మరి ప్రచార కార్యక్రమాలలో BVSN ప్రసాద్ ఎలాంటి వాక్చాతుర్యం చూపిస్తారో చూడాలి.ఇక పవన్ కళ్యాణ్ సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం హరిహర వీరమల్లు, బ్రో, భగత్ సింగ్, OG వంటి వరుస సినిమాలతో ఫుల్ బిజీగా వున్నాడు.