బాలయ్య సక్సెస్ లకు కారణం అదేనా..?
బాలయ్య అఖండ ,వీరసింహారెడ్డి, వంటి చిత్రాలు వరుసగా విజయాలు అందుకోవడానికి ముఖ్య కారణం బాలయ్య తన వయసుకు తగ్గ పాత్రలలో నటించడమే అన్నట్టుగా తెలుస్తోంది.. అంతేకాకుండా థమన్ కూడా బ్యాగ్రౌండ్ స్కోరు బాలయ్యకు అదిరిపోయేలా ఇవ్వడము కూడా ఒక ప్లస్ అని చెప్పవచ్చు.. ఇక ఇప్పుడు బాలయ్య నటిస్తున్న భగవంత్ కేసరి చిత్రంలో కూడా తన వయసుకు తగ్గ పాత్రలు నటిస్తూ ఉన్నారు. నిన్నటి రోజున బాలయ్య బర్తడే సందర్భంగా ఒక అదిరిపోయి టీజర్ ని కూడా విడుదల చేసింది చిత్ర బృందం.ఈ సినిమాని డైరెక్టర్ అనిల్ రావు పూడి దర్శకత్వం వహిస్తున్నారు.
ఈ సినిమా తెలంగాణ యాస నేపథ్యంలో తెరకెక్కిస్తూ ఉన్నారు. మరొకసారి ఈ చిత్రంలో బాలయ్య మాస్ యాంగిల్ ని చూడబోతున్నామని చెప్ప వచ్చు. బాలయ్య సక్సెస్ లకు కారణం ఆయన వయసుకు తగ్గ పాత్రలలో నటించడమే అని కొంతమంది సినీ విశ్లేషకులు సైతం తెలియజేస్తున్నారు. ఏది ఏమైనా ఈ వయసులో కూడా బాలయ్య వరుస సినిమాలతో విజయాలు అందుకుంటూ అభిమానులను బాగానే ఆకట్టుకుంటున్నారు. మరి భగవంత్ కేసరి చిత్రంతో హ్యాట్రిక్ విజయాన్ని అందుకుంటారేమో చూడాలి మరి. ఈ సినిమా అయిపోయిన వెంటనే డైరెక్టర్ బోయపాటి శ్రీనుతో లేకపోతే బాబీ డైరెక్షన్లో సినిమాలో నటించే అవకాశం ఉన్నట్లు సమాచారం.