బ్లాక్ అండ్ బోల్డ్ లుక్.. మృణాల్ అస్సలు తగ్గట్లేదు..!

shami
సీతారామం బ్యూటీ మృణాల్ ఠాకూర్ సోషల్ మీడియాలో తన హాట్ స్టిల్స్ తో అదరగొట్టేస్తుంది. అమ్మడు చేస్తున్న సినిమాలేమో కానీ ఆమె ఫోటో షూట్స్ తో అదరగొడుతుంది. మృణాల్ లేటెస్ట్ గా బ్లాక్ అండ్ బోల్డ్ లుక్స్ క్రేజీగా మారాయి. అందాల ప్రదర్శనలో తన తర్వాతే ఎవరైనా అనిపించేలా మృణాల్ రెచ్చిపోతుంది. సీతారామం ముందు వరకు కెరీర్ ఎలా ఉన్నా ఆ సినిమా హిట్ అమ్మడిలో జోష్ పెంచింది. సీతారామం వల్ల సౌత్ ఆడియన్స్ లో విపరీతమైన ఫాలోయింగ్ ఏర్పరచుకుంది మృణాల్.
అయితే సీతారామం లో ఆమె చేసిన పాత్రకి అమ్మడు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్న ఫోటో షూట్స్ కి అసలు సంబంధం లేదని చెప్పొచ్చు. మృణాల్ ఠాకూర్ ఏం చేసినా దానికో లెక్క ఉంటుంది అనేలా రెచ్చిపోవడంలో కూడా తన మార్క్ చూపిస్తుంది. లేటెస్ట్ గా బ్లాక్ అండ్ బోల్డ్ లుక్స్ తో అమ్మడు దుమ్ము దులిపేస్తుంది. తనని చూస్తే చూపు మరల్చుకోలేనంతగా ఉందంటే నమ్మాలి. మృణాల్ ప్రస్తుతం నాని 30వ సినిమాలో నటిస్తుంది. ఆ సినిమాలో కూడా మృణాల్ మ్యారీడ్ ఉమెన్ గా కనిపిస్తుందని తెలుస్తుంది.
ఇక బాలీవుడ్ లో కూడా సీతారామ వల్ల క్రేజ్ తెచ్చుకున్న మృణాల్ అక్కడ అవకాశాలు అందుకుంటుంది. అయితే సినిమాలు ఎలా ఉన్నా అమ్మడు గ్లామర్ షో విషయంలో మాత్రం తగ్గేదేలే అన్నట్టు రెచ్చిపోతుంది. మృణాల్ చేస్తున్న ఈ హాట్ షోకి ఆమె ఫ్యాన్స్ సైతం అవాక్కవుతున్నారు. ఫాలోవర్స్ కి మాస్ ట్రీట్ అందిస్తున్న మృణాల్ ఠాకూర్ ఎప్పటికీ సూపర్ అని చెప్పడంలో సందేహం లేదు. తెలుగులో కూడా స్టార్ ఛాన్స్ ల కోసం ఎదురుచూస్తున్న మృణాల్ కి నాని సినిమా కూడా హిట్ పడితే మాత్రం ఇక్కడ వరుస ఆఫర్లు వచ్చే అవకాశం ఉంది. తమిళంలో కూడా మృణాల్ కి ఒక సినిమా డిస్కషన్ లో ఉన్నట్టు తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: