'పుష్ప' సినిమాని మిస్ చేసుకున్న స్టార్ హీరో ఎవరో తెలుసా..?

Anilkumar
సినీ ఇండస్ట్రీలో అప్పుడప్పుడు కొన్ని పొరపాట్లు జరుగుతూ ఉంటాయి. ముఖ్యంగా సినిమాల విషయంలో వీటిని ఎక్కువగా చూస్తుంటాం. అంటే ఓ హీరో చేయాల్సిన సినిమా మరో హీరో వద్దకు వెళ్లడం చివరకు ఆ సినిమాతోనే ఆ హీరో కి స్టార్ ఇమేజ్ రావడం ఇప్పటికే చాలాసార్లు చాలామంది హీరోల విషయంలో జరిగింది. ఒక్కోసారి హీరోలు చేసే చిన్న చిన్న పొరపాట్లు పెద్ద ఫలితాలను మూట కట్టుకుంటాయి. కొంతమంది హీరోలు తమ దగ్గరికి వచ్చిన కథలను విని అవి తమకి సెట్ కావనో, నచ్చకనో రిజెక్ట్ చేస్తూ ఉంటారు. అలా రిజెక్ట్ చేసిన మూవీని వేరే హీరో ఓకే చేయడం ఆ సినిమా హిట్ అయితే అప్పుడు రిజెక్ట్ చేసిన హీరో బాధపడాల్సి వస్తుంది. 

ఇప్పుడు ఓ అగ్ర హీరో సైతం ఇదే సిచువేషన్ ఫేస్ చేసినట్టు తెలుస్తోంది. ఎందుకంటే ఆ అగ్ర హీరో 'పుష్ప' లాంటి పాన్ ఇండియా సినిమాను రిజెక్ట్ చేశాడు. టాలీవుడ్ క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఎంత పెద్ద విజయాన్ని అందుకుందో అందరికీ తెలిసిందే. అల్లు అర్జున్ హీరోగా నటించిన ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడమే కాకుండా బన్నీకి పాన్ ఇండియా రేంజ్ లో క్రేజ్ ను తెచ్చిపెట్టింది. నిజానికి పుష్ప కథను ముందుగా సూపర్ స్టార్ మహేష్ బాబును ఊహించుకుని రాసుకున్నాడట సుకుమార్. మహేష్ బాబు అయితేనే ఈ మూవీకి సరిగ్గా సూట్ అవుతాడని ఆయన భావించారట.

కానీ అంత మాస్ లుక్, జుట్టు, గడ్డం తనకు సెట్ కావని మహేష్ బాబు పుష్ప మూవీని సున్నితంగా తిరస్కరించాడట. దాంతో సుకుమార్ ఈ పుష్ప స్టోరీని అల్లు అర్జున్ కి వినిపించాడట. కథ విన్న బన్నీ వెంటనే ఓకే చెప్పేసాడు. దాంతో సుకుమార్ కూడా బన్నీ బాడీ లాంగ్వేజ్ కి తగ్గట్టు కథలో కొన్ని మార్పులు చేర్పులు చేసి ఫుల్ స్క్రిప్ట్ రెడీ చేశాడు. దీంతో బన్నీ ఊహించినట్టుగానే సినిమా సంచలన విజయాన్ని అందుకుంది. ఇప్పుడు ఈ సినిమాకి కొనసాగింపుగా సుకుమార్ బన్నీ కాంబినేషన్లో 'పుష్ప2' కూడా రాబోతోంది. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ మూవీని ఈ ఏడాది చివర్లో విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే పుష్ప2 నుండి విడుదలైన టీజర్ సినిమాపై అంచనాలను రెట్టింపు చేసింది. movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">మైత్రి మూవీ మేకర్స్ సుమారు 400 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమాకి రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీతమందిస్తున్నాడు..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: