చిరంజీవి స్పీడ్ పై కామెంట్స్ !

Seetha Sailaja

తెలుగు సినిమా చరిత్రలో చిరంజీవికి ప్రముఖ స్థానం ఉంది. ఆయన పేరు వినగానే ఎవరికైనా వెంటనే గుర్తుకు వచ్చేది ఆయన డాన్సింగ్ స్కిల్స్. ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ మైకేల్ జాక్సన్ గా అతడిని ఆరాధించే వ్యక్తులు దేశవ్యాప్తంగానే కాదు ప్రపంచ వ్యాప్తంగా లక్షల సంఖ్యలో ఉన్నారు.

ప్రస్తుతం చిరంజీవి వయసు 68 సంవత్సరాలు ఈ వయసులో కూడ వరసపెట్టి సినిమాలు చేస్తూ టాప్ యంగ్ హీరోలకు షాక్ ఇస్తున్నాడు. ‘వాల్తేర్ వీరయ్య’ ఘనవిజయం సాధించడంతో అతడి స్థాయి మరొకసారి అందరికి అర్థం అయింది. లేటెస్ట్ గా ఆయన నటిస్తున్న ‘భోళాశంకర్’ మూవీ నుండి ఒక పాట రిలీజ్ అయింది. మణిశర్మ కొడుకు మహతి ట్యూన్ చేసిన ఈ లిరికల్ వీడియోలో చిరంజీవి వేసిన రెండు స్టెప్స్ కూడ పాటతో పాటు ఈ లిరికల్ వీడియోలో యాడ్ చేసారు.

చిరంజీవి తనదైన గ్రేస్ తో ఈ స్టెప్స్ వేసి అలరించడంతో మెగా అభిమానులు పూర్తి జోష్ లో ఉన్నారు. అయితే ఈ లిరికల్ వీడియోను చూసిన కొందరు చిరంజీవి డాన్స్ లో వేగం తగ్గిందని అంటూ నెగిటివ్ కామెంట్స్ సోషల్ మీడియాలో పెడుతున్నారు. అయితే ఈ కామెంట్స్ కు చిరంజీవి అభిమానుల నుండి ఘాటైన సమాధానం వస్తోంది. మామూలుగా ఈ వ‌య‌సులో లేచి తిర‌గ‌డ‌మే చాలామందికి కష్టం. అలాంటిది చిరంజీవి స్టెప్స్ వేసి అలరించడం ఒక ఆర్ట్ అంటూ ఇప్పటికీ డ్యాన్సులు ఫైట్స్ తో నెంబర్ వన్ స్థాయిలో ఉన్న చిరంజీవిని డామినేట్ చేసే స్థాయి ప్రస్థుత తరంలో ఏటాప్ యంగ్ హీరోకి ఉంది అంటూ మెగా అభిమానులు సోషల్ మీడియాలో కామెంట్స్ పెడుతున్నారు.

ఆగష్టులో విడుదల కాబోతున్న ‘భోళశంకర్’ మూవీతో మళ్ళీ టాలీవుడ్ లో సిస్టర్ సెంటిమెంట్ కథలు చాల ఎక్కువగా వచ్చే ఆస్కారం కనిపిస్తోంది. ఈమూవీతో రజనీకాంత్ ‘జైలర్’ మూవీ కూడ విడుదల అవుతున్న పరిస్థితులలో ఎప్పుడూ లేనివిధంగా రజనీకాంత్ చిరంజీవిల మధ్య వార్ ఏర్పడింది..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: