"బ్రో" మూవీ కథను అంతలా మార్పులు చేశారా..?

Pulgam Srinivas
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ... సాయి ధరమ్ తేజ్ లు కలిసి "బ్రో" అనే మూవీ లో హీరోలుగా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ తమిళ ప్రేక్షకులను ఎంత గానో ఆలోచించి నటువంటి వినోదయ సీతం అనే మూవీ కి అధికారిక రీమేక్ గా రూపొందుతుంది. ఈ మూవీ యొక్క ఒరిజినల్ కు దర్శకత్వం వహించిన సముద్ర ఖని "బ్రో" మూవీ కి కూడా దర్శకత్వం వహిస్తున్నాడు. ఇది ఇలా ఉంటే "బ్రో" మూవీ రీమేక్ ను చేస్తున్నట్లు ప్రకటించడంతో పవన్ అభిమానులు కాస్త నిరాశకు గురయ్యారు. ఎందుకంటే ఈ సినిమాను ఆల్రెడీ తెలుగు లో కూడా విడుదల చేశారు. అలాగే చాలా మంది ఈ మూవీ తెలుగు వర్షన్ ను కూడా చూశారు.

దానితో ఆల్రెడీ చూసిన సినిమాలు మళ్లీ ఎందుకు రీమేక్ చేయడం ... ఆ సినిమా జనాలను అంతగా ఆదరిస్తుందా అని వారు ఈ సినిమా విషయంలో కాస్త నిరాశను వ్యక్తం చేశారు. కానీ మూవీ బృందం మాత్రం ఈ మూవీ కథ ... కథనంలో అనేక మార్పులు ... చేర్పులు చేసినట్లు మొదటి నుండి తెలుస్తూనే వస్తుంది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ మూవీ లో చాలా మార్పులు ... చేర్పులు చేసినట్లు తెలుస్తోంది. ఈ మూవీ ఒరిజినల్ లో ఎలాంటి పాటలు ఉండవు ... కానీ ఈ మూవీ రీమిక్ లో చాలా పాటలు ఉండబోతున్నట్లు తెలుస్తోంది.

అలాగే కథనం కూడా బాగా మారబోతున్నట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ మూవీ లో ఒక స్పెషల్ సాంగ్ కూడా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. అలాగే ఆ స్పెషల్ సాంగ్ లో ఊర్వశి రౌతేల కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ సాంగ్ కూడా ఒరిజినల్ మూవీ లో ఉండదు ... దానితో ఈ మూవీ కథ ... కథనంలో భారీ మార్పులు చేసినట్లు తెలిసిపోతుంది. ఇలా "బ్రో" మూవీ ని భారీ మార్పులు ... చేర్పులతో ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: