టక్కర్ సినిమాతో నా డ్రీమ్ నెరవేరింది :సిద్దార్థ్

murali krishna
తెలుగులో లవర్ బాయ్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న వారిలో నటుడు సిద్ధార్థ్ కూడా ఒకరు. సిద్ధార్థ హీరోగా బొమ్మరిల్లు, నువ్వొస్తానంటే నేనొద్దంటానా వంటి ఎన్నో అద్భుతమైన ప్రేమ కథ సినిమాల ద్వారా ఆయన మెప్పించాడు.
ఇలా పలు సినిమాలలో నటించి హీరోగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న సిద్ధార్థ్ కొంతకాలం పాటు తెలుగు చిత్ర పరిశ్రమకు దూరమయ్యారు. గత ఏడాది క్రితం శర్వానంద్ తో కలిసి మహాసముద్రం అనే సినిమా ద్వారా ప్రేక్షకులను పలుకరించాడు.
ఈ సినిమా కూడా పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయిందని చెప్పవచ్చు.ఇకపోతే తాజాగా దర్శకుడు కార్తీక్ జీ దర్శకత్వంలో సిద్ధార్థ్, దివ్యాంశా కౌశిక్ ప్రధాన పాత్రలలో నటించిన చిత్రం టక్కర్. ఈ సినిమా జూన్ 9వ తేదీ విడుదల కానుంది.తెలుగు తమిళ భాషలలో ఈ సినిమా విడుదల కానున్న నేపథ్యంలో హైదరాబాదులో ఈ సినిమా ప్రీరిలీజ్ వేడుకను కూడా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సురేష్ బాబు, బొమ్మరిల్లు భాస్కర్ మరియి తరుణ్ భాస్కర్ వంటి తదితరులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఇక ఈ కార్యక్రమంలో భాగంగా నటుడు సిద్ధార్థ్ మాట్లాడుతూ పలు ఆసక్తికరమైన విషయాలను కూడా వెల్లడించారు. ఈ సందర్భంగా సిద్ధార్థ్ మాట్లాడుతూ.. టక్కర్ సినిమా ఒక యాక్షన్ ఫిల్మ్ అని యాక్షన్లో ఓ లవ్ స్టోరీని యాడ్ చేయడం జరిగింది.. ఇప్పటివరకు మీరు ఈ చిత్రంలో లవర్ బాయ్ చాలా రఫ్ గా కనిపిస్తాడు. ఈ సినిమా చూడటానికి  తప్పకుండా థియేటర్లకు రావాలని సిద్ధార్థ్ అందరిని కోరారు. పూర్తి యాక్షన్ సినిమా చేయాలని నా కల ఈ సినిమాతో నెరవేరిందని ఈ సందర్భంగా సిద్ధార్థ్ తెలియజేశారు.ఇక తాను చిన్నవయసులోనే లెజెండ్స్ తో కలిసిన నటించే అవకాశం తనకు వచ్చిందని ఇది తనకు దేవుడిచ్చిన వరంగా అయితే భావిస్తున్నానని సిద్ధార్థ్ తెలిపారు. ప్రముఖ నిర్మాత రామానాయుడు గారు నాకు ఇచ్చిన స్ఫూర్తి ప్రోత్సాహం నేను ఎప్పుడు కూడా మరువలేనని తాను సురేష్ ప్రొడక్షన్ కి ఎప్పుడు కూడా రుణపడి ఉంటాను అంటూ ఈ సందర్భంగా సిద్ధార్థ్ చేసిన కామెంట్స్ బాగా వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: