సూసైడ్ చేసుకోవాలనుకున్న సమంత.. ఒక్క ట్వీట్ తో గుట్టు రట్టు..!

Divya
ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్న సమంత గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.. ఒకప్పుడు వరుస సినిమాలు చేస్తూ భారీ పాపులారిటీ దక్కించుకున్న సమంత.. ఎప్పుడైతే తన భర్త నాగచైతన్యను ప్రేమించి పెళ్లి చేసుకుని విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే. అప్పటినుంచి ఏదో ఒక విషయంపై ఆమె వార్తల్లో నిలుస్తూ వస్తోంది. కొన్ని నెలల క్రితం మయోసిటీస్ అనే వ్యాధి బారిన పడ్డ సమంత ఇటీవల వ్యాధి నుంచి బయటపడి సినిమాలు చేస్తూ మళ్ళీ తన కెరియర్లో బిజీ అయ్యే ప్రయత్నాలు చేస్తోంది.
అందులో భాగంగానే యశోద సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయాన్ని సొంతం చేసుకున్న ఈమె ఆ తర్వాత శాకుంతలం అనే హిస్టారికల్ మూవీతో ప్రేక్షకులను అలరించే ప్రయత్నం చేసింది. కానీ పెద్దగా సక్సెస్ కాలేదు. ఇక దాంతో తెలుగు సినిమాలను పక్కన పెట్టేసి ఇప్పుడు ఎక్కువగా బాలీవుడ్ సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తోంది. ఈ క్రమంలోనే సిటాడెల్ వెబ్ సిరీస్ లో నటిస్తున్న సమంత మరొకవైపు చెన్నై స్టోరీస్ అనే హాలీవుడ్ సినిమాలో కూడా అవకాశాలు దక్కించుకుంది. ఇదిలా ఉండగా ప్రస్తుతం సమంతా కు సంబంధించిన ఒక వార్త నెట్టింట వైరల్ గా మారుతుంది.  దీనికి కారణం ప్రముఖ ఫిలిం క్రిటిక్ ఉమైర్ సందు అని చెప్పాలి.
సెలబ్రిటీలపై ఏదో ఒక కామెంట్లు చేస్తూ నిత్యం వార్తల్లో నిలుస్తూ వుండే ఈయన  తాజాగా సమంతపై కూడా కామెంట్లు చేశారు. "సమంత ఆరోగ్యం ప్రస్తుతం బాగోలేదని.. ఆమె సూసైడ్ కూడా చేసుకోవాలనుకుందని.. అయితే ఈ విషయాలు అన్నీ కూడా సమంతకు అత్యంత సన్నిహితులుగా ఉండే వ్యక్తుల ద్వారా తనకు తెలిసింది అంటూ ఈ విషయాలను ట్విట్టర్ ద్వారా పోస్ట్ చేస్తూ సమంత ఫోటో కూడా షేర్ చేశాడు ఉమైర్ సంధు.. దీంతో సమంత అభిమానులు ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. ఆమె ఎందుకు సూసైడ్ చేసుకోవాలను కుంటుంది అంటూ ప్రశ్నిస్తున్నారు. మరి దీనిపై సమంత ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: